ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Former Village Head Lover: ప్రియురాలిని చంపి.. శరీరాన్ని ముక్కలు, ముక్కలు చేసి..

ABN, Publish Date - Aug 22 , 2025 | 02:55 PM

Former Village Head Lover: ఆమెను పెళ్లి చేసుకోవటం అతడికి ఇష్టం లేదు. రచన అతడి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవటం పెద్ద మైనస్ అయింది. పెళ్లి కోసం బలవంతం చేస్తున్న ఆమె అడ్డు ఎలాగైనా తొలగించాలని అతడు భావించాడు.

Former Village Head Lover

పెళ్లి చేసుకోమంటూ బలవంతం చేస్తోందన్న కారణంతో ఓ మాజీ సర్పంచ్ దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలిని చంపి ముక్కలు, ముక్కలు చేశాడు. శరీర భాగాల్ని వేరు వేరు చోట్ల పడేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఝాన్సీలోని మహేవా గ్రామానికి చెందిన రచనా యాదవ్ మాజీ గ్రామ సర్పంచ్ మహేవా సంజయ్ పాటిల్‌తో రెండేళ్లుగా రిలేషన్‌లో ఉంది. తనను పెళ్లి చేసుకోవాలని గత కొద్దిరోజులనుంచి ఆమె సంజయ్‌పై ఒత్తిడి తెస్తోంది.

ఆమెను పెళ్లి చేసుకోవటం అతడికి ఇష్టం లేదు. రచన అతడి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవటం పెద్ద మైనస్ అయింది. పెళ్లి కోసం బలవంతం చేస్తున్న ఆమె అడ్డు ఎలాగైనా తొలగించాలని అతడు భావించాడు. దీని కోసం ఓ ప్లాన్ వేశాడు. రచనను చంపడానికి తన మేనల్లుడు సందీప్ పాటిల్, మరో యువకుడు దీపక్ అహిర్వార్‌ల సాయం తీసుకున్నాడు. ఆగస్టు 9వ తేదీ రాత్రి ముగ్గురు కలిసి ఆమెను చంపారు. తర్వాత శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశారు. చేతులు, మొండాన్ని కిశోర్‌పురలోని బావిలో పడేశారు.

తల, కాళ్లను దగ్గరలోని రైవాన్ నదిలో పడేశారు. ఆగస్టు 13వ తేదీన బావిలోని రచన చేతులు, మొండెం పోలీసులకు దొరికాయి. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహేవా గ్రామానికి చెందిన రచన యాదవ్ గత కొద్దిరోజులనుంచి కనిపించటం లేదని దర్యాప్తులో తెలిసింది. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. సంజయ్‌కి, రచనకు ఉన్న సంబంధం బయటపడింది. పోలీసులు సంజయ్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా.. మర్డర్ సంగతి బయటపడింది. సంజయ్‌కి సహకరించిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నదిలో పారేసిన తల, కాళ్ల కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్, ఆర్జేడీ చొరబాటుదారుల్ని ప్రోత్సహిస్తున్నాయి, త్వరలో జనాభా మిషన్‌: ప్రధాని మోదీ

కోఆపరేటివ్ బ్యాంకులకూ పూర్తిస్థాయి ఆధార్ ఆథెంటికేషన్ సేవలు.. యూఐడీఏఐ నిర్ణయం

Updated Date - Aug 22 , 2025 | 02:58 PM