Chennai: గూడ్సురైలులో అగ్ని ప్రమాదం..
ABN, Publish Date - Jun 18 , 2025 | 11:39 AM
తూత్తుకుడి హార్బర్ నుండి నేలబొగ్గు లోడుతో బయలుదేరిన గూడ్స్ రైలులో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆ రైలును కోవిల్‌పట్టి రైల్వేస్టేషన్‌లో నిలిపి అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి ఆ మంటలను ఆర్పివేశారు. తూత్తుకుడి హార్బర్ నుండి 59 బోగీల నేలబొగ్గుతో ఓ గూడ్సురైలు కరూరు జిల్లా పుగలూరు పేపర్ కర్మాగారానికి బయలుదేరింది.
- ఓ బోగీలో నేలబొగ్గు దగ్ధం
చెన్నై: తూత్తుకుడి హార్బర్ నుండి నేలబొగ్గు లోడుతో బయలుదేరిన గూడ్స్ రైలులో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆ రైలును కోవిల్‌పట్టి రైల్వేస్టేషన్‌లో నిలిపి అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి ఆ మంటలను ఆర్పివేశారు. తూత్తుకుడి హార్బర్ నుండి 59 బోగీల నేలబొగ్గుతో ఓ గూడ్సురైలు కరూరు జిల్లా పుగలూరు పేపర్ కర్మాగారానికి బయలుదేరింది. ఆ రైలు మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఆ గూడ్సురైలు కడంబూరు - కోవిల్‌పట్టి(Kadamburu - Kovilpatti) మధ్య వెళ్తుండగా ఓ బోగీలో ఉన్న నేల బొగ్గుకు నిప్పంటుకుని మంటలు వ్యాపించాయి.
ఆ సమయంలో డ్యూటీలో ఉన్న రైల్వే ఉద్యోగి వేలుసామి బోగీలోని నేలబొగ్గు మండుతుండటం గమనించి ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. వెంటనే ఆ రైలును కోవిల్‌పట్టి రైల్వేస్టేషన్ వద్ద నిలిపేశారు. రైల్వే సిబ్బంది ఆ గూడ్సురైలులోని 17వ నెంబర్ బోగీ నుంచి మంటలు రావటం గమనించి అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
అగ్నిమాపక దళం ఫైరింజన్ అక్కడికి చేరుకుని గంటసేపు పోరాడి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ సంఘటన కారణంగా కోవిల్‌పట్టి మీదుగా వెళ్లే తిరుచ్చి - తిరువనంతపురం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్(Intercity Express), నల్లి రైల్వేస్టేషన్ వద్ద, చెన్నై - నాగర్‌కోవిల్ వందేభారత్ విరుదునగర్ రైల్వేస్టేషన్ వద్ద నిలిపివేశారు. గంట తరువాత ఆ మార్గంలో రైళ్లరాకపోకలను పునరుద్ధరించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ఇంజనీరింగ్‌లో మళ్లీ ‘నచ్చిన సబ్జెక్టులు’!
సౌర విద్యుత్‌పై అవగాహన పెంచాలి
Read Latest Telangana News and National News
Updated Date - Jun 18 , 2025 | 12:03 PM