ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: సైబరాబాద్‌లో 480 మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

ABN, Publish Date - Oct 20 , 2025 | 09:26 AM

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని 16 ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో వారం రోజుల వ్యవధిలో నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడిన 480 మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశామని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ డాక్టర్‌ గజరావు భూపాల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్‌ సిటీ: సైబరాబాద్‌ కమిషనరేట్‌(Cyberabad Commissionerate) పరిధిలోని 16 ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో వారం రోజుల వ్యవధిలో నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడిన 480 మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశామని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ డాక్టర్‌ గజరావు భూపాల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మియాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 82, జీడిమెట్లలో 54, శంషాబాద్‌లో 44, రాజేంద్రనగర్‌లో 40, గచ్చిబౌలి, షాద్‌నగర్‌లో 38 మంది చొప్పున మొత్తం 480 మందిపై కేసులు నమోదయ్యాయి.

21-30 ఏళ్ల వయసున్న వారు 180 మంది, 31-40 ఏళ్ల వయసున్న వారు 177మంది ఉన్నారు. వీరిలో 371 మంది ద్విచక్ర వాహనదారులు, త్రీ వీలర్స్‌ 19 మంది, ఫోర్‌ వీలర్స్‌ 85, భారీ వాహనాల డ్రైవర్లు ఐదుగురుఉన్నారు. వీరందరినీ కోర్టులో హాజరు పర్చామని జాయింట్‌ సీపీ తెలిపారు. ఈనెల 13 నుంచి 18 వరకు చేపట్టిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పర్చగా, అందులో 357 మందికి జరిమానా, 15 మందికి జైలు శిక్షను న్యాయస్థానం విధించిందని తెలిపారు. అదేవిధంగా 20మందికి సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని కోర్టు సూచిందని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ తెలిపారు.

సెంట్రల్‌ జోన్‌ పరిధిలో 25 మందికి జైలు

- సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌కు రూ.1100 జరిమానా

హైదరాబాద్‌ సిటీ: సెంట్రల్‌ జోన్‌ పరిధిలో శనివారం ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. అబిడ్స్‌, చిక్కడపల్లి, సైఫాబాద్‌, గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన వారిలో 212 మందిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. మద్యం సేవించి పట్టుబడిన వారిలో 187 మందికి ఒక్కొక్కరికి న్యాయస్థానం రూ3,100 జరిమానా విధించింది. ఎక్కువ మోతాదులో మద్యం సేవించడం, తరచూ పట్టుబడిన 25 మందికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడ్డ 147 మందికి ఒక్కొక్కరికి రూ.1100, మైనర్‌ డ్రైవింగ్‌కు సంబంధించి ఒక్కొక్కరికి రూ2,100 చొప్పున జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది

ఈ వార్తలు కూడా చదవండి..

దీపావళి రోజున మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ముస్లింలకు అట్రాసిటీ చట్టం తీసుకురావాలి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 20 , 2025 | 09:26 AM