Bengaluru News: మైసూరులో పట్టపగలు దారుణ హత్య...
ABN, Publish Date - Oct 08 , 2025 | 01:18 PM
సాంస్కృతిక నగరి మైసూరులో పట్టపగలు దారుణహత్య జరిగింది. దసరా ఉత్సవాలతో సందడిగా సాగిన మైసూరు ఇప్పుడే ప్రశాంత వాతావరణ పరిస్థితికి వస్తున్న తరుణంలోనే హత్య జరిగింది.
బెంగళూరు: సాంస్కృతిక నగరి మైసూరు(Mysoor)లో పట్టపగలు దారుణహత్య జరిగింది. దసరా ఉత్సవాలతో సందడిగా సాగిన మైసూరు ఇప్పుడే ప్రశాంత వాతావరణ పరిస్థితికి వస్తున్న తరుణంలోనే హత్య జరిగింది. క్యాతమారనహళ్ళి నివాసి వెంకటేష్ మంగళవారం మధ్యాహ్నం మైసూరు దసరా ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన వస్తుప్రదర్శనశాల మైదానం వద్ద ఉండగా, అక్కడికి వచ్చిన ప్రత్యర్థులు కాపుగాచి ఈ దారుణానికి ఒడిగట్టారు. కారులో ఉన్న వెంకటేష్ ను బయటకు లాగి మారణాయుధాలతో దాడి చేశారు.
తల, చేయి, కాళ్ళతో పాటు శరీరంలోని వివిధ భాగాలలో బలమైన దెబ్బలు తగిలాయి. ఒక్కసారిగా వెంకటేష్ కిందపడిపోవడంతో దాడికి పాల్పడినవారు అక్కడి నుంచి పరారీ అయ్యారు. విషయం తెలిసిన వెంటనే నజరబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే వెంకటేష్(Venkatesh) మృతి చెందినట్లు నిర్ధారించారు. నగర పోలీసు కమిషనర్ సీమాలాట్కర్, డీసీపీ బిందురాణి, సుందర్‌రాజ్ అక్కడికి చేరుకుని ప్రాథమికంగా పరిశీలించారు. హత్యకు పాల్పడిన వారు ఉపయోగించిన వాహనాల ప్రకారం గాలింపులు చర్యలకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.
ఇటీవల వరుణ పట్టణంలోని ఓహోటల్ ముందు ఉన్న రౌడీషీటర్ కార్తీక్‌ను హతమార్చిన వారే వెంకటేష్ ను కూడా హత్యచేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కార్తీక్, వెంకటేష్ లు ఆప్తులుగా కొనసాగారు. ఇరువురి వడ్దీ వ్యాపారంతో పాటు పలు వ్యవహారాలు చేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఐదునెలల కిందట కార్తీక్‌ను హత్య చేశారు. అదే తరహాలోనే వెంకటే్‌షను హతమార్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి పరుగు మరింత ముందుకు.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బిగ్ బాస్‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..
Read Latest Telangana News and Nationa
Updated Date - Oct 08 , 2025 | 01:18 PM