ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bengaluru News: భార్యను చంపి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం..

ABN, Publish Date - Sep 11 , 2025 | 12:38 PM

ఆరు నెలల గర్భంతో ఉన్న భార్యను హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నానికి పోలీసులు షాక్‌ ఇచ్చారు. అడ్వకేట్‌ అయిన భర్తతోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్టు బెళగావి జిల్లా ఎస్పీ బీమాశంకర్‌ గుళేద్‌ తెలపారు. 7వ తేదీ కాగవాడ తాలూకా ఉగార గ్రామానికి చెందిన చైతాలి(23)ను హత్య చేసినట్టు ఎస్పీ తెలిపారు.

- అడ్వకేట్‌ భర్తతోపాటు మరో ఇద్దరి అరెస్టు

బెంగళూరు: ఆరు నెలల గర్భంతో ఉన్న భార్యను హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నానికి పోలీసులు షాక్‌ ఇచ్చారు. అడ్వకేట్‌ అయిన భర్తతోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్టు బెళగావి(Belagavi) జిల్లా ఎస్పీ బీమాశంకర్‌ గుళేద్‌ తెలపారు. 7వ తేదీ కాగవాడ తాలూకా ఉగార గ్రామానికి చెందిన చైతాలి(23)ను హత్య చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఆమె భర్త, అడ్వకేట్‌ ప్రదీప్‌ అన్నాసాహెబ్‌ కిరణగి, సద్దాం అక్బర్‌ ఇమాందార్‌, రాజన్‌ గణపతి కాంబళెలను అరెస్టు చేశామన్నారు.

కాగవాడ(Kagawada) పోలీసులకు ఆదివారం రాత్రి ప్రదీప్‌ ఫోన్‌ చేసి భార్యకు ప్రమాదం జరిగిందని, మీరు రక్షించాలంటూ వేడుకున్నారు. ఉన్నత చికిత్సకోసం కాగవాడలోని కమ్యూనిటీ ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్టు తెలిపారు. వెంటనే ఓ కానిస్టేబుల్‌ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే కాగవాడ ఆసుపత్రికి ఎవరూ చేరుకోలేదు. అడ్వకేట్‌కు ఫోన్‌ చేస్తే పరిస్థితి విషమించడంతో మహారాష్ట్రలోని మీరజ్‌ ఆసుపతిక్రి తీసుకెళ్లానని అయితే భార్య మృతి చెందారని తెలిపారు.

చట్టపరమైన ప్రక్రియలను త్వరితగతిన జరపాలని, తదుపరి చర్యలు కొనసాగిస్తామని పోలీసు కానిస్టేబుల్‌కు వివరించారు. ఆ తర్వాత కానిస్టేబుల్‌తోపాటు ఎస్సైకు అడ్వకేట్‌ పదే పదే ఫోన్‌ చేశారు. చైతాలి, ప్రదీప్ లు ఒకే గ్రామానికి చెందినవారు. ప్రేమించుకుని రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రదీప్ కు మరో మహిళతో ప్రేమ ఏర్పడింది. ఆ మహిళతో ఇతడికి ఇప్పటికే వివాహం జరిగింది. చైతాలికి బిడ్డ పుడితే అందరికీ తెలిసిపోతుందని పథకం ప్రకారం చంపదలిచారు. ఇలా ఆదివారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్దామని భార్యను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారు.

గ్రామం దాటాక మూత్రవిసర్జన చేయాలని ద్విచక్రవాహనం ఆపాడు. అంతలోనే ప్రదీప్‌ మిత్రులు కారులో వచ్చి రోడ్డుపక్కన ద్విచక్రవాహనం వద్ద నిలబడి ఉన్న ఆమెను ఢీ కొట్టారు. ఆ తర్వాత అదే కారులో ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్టు నాటకం ఆడారు. కొంతమేర గాయాలైన ఆమెను తలకు రాడ్‌తో బలంగా కొట్టగా ఆమె మృతి చెందారన్నారు. ప్రమాదస్థలానికి వెళ్లినప్పుడే అనుమానం వచ్చిందని ఆ కోణంలోనే విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. వారు ప్రదీప్ తోపాటు ఇద్దరు వేర్వేరు అభిప్రాయాలు తెలిపారని సమగ్ర విచారణలో వాస్తవాలు అంగీకరించారన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

పిడుగుపాట్లకు 9 మంది బలి

Read Latest Telangana News and National News

Updated Date - Sep 11 , 2025 | 12:38 PM