ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: ఆ రెండు చుక్కల అధికారి మామూలాయన కాదుగా.. మీ ఆయన నా జేబులో ఉన్నాడా అంటూ..

ABN, Publish Date - Nov 11 , 2025 | 12:28 PM

‘ఏంటి..! మీ ఆయన నా జేబులో ఉన్నాడా? తెచ్చి ఇవ్వడానికి’ ఇదీ ఓ బాధితురాలు స్టేషన్‌కు వెళితే ఎస్ఐ(SI) నుంచి వచ్చిన హూంకరింపుతో కూడిన సమాధానం. ఇలా కొందరు పోలీస్‌ అధికారులు బెదిరింపు ధోరణిలో సమాధానం ఇస్తుంటే...మరికొందరు దివ్యాంగులు అనే కనికరం కూడా చూపడం లేదు.

- బాధితురాలిపై ఎస్‌ఐ హూంకరింపు

- న్యాయం కోసం ఎస్పీ కార్యాలయానికి బాధితులు

అనంతపురం: ‘ఏంటి..! మీ ఆయన నా జేబులో ఉన్నాడా? తెచ్చి ఇవ్వడానికి’ ఇదీ ఓ బాధితురాలు స్టేషన్‌కు వెళితే ఎస్ఐ(SI) నుంచి వచ్చిన హూంకరింపుతో కూడిన సమాధానం. ఇలా కొందరు పోలీస్‌ అధికారులు బెదిరింపు ధోరణిలో సమాధానం ఇస్తుంటే...మరికొందరు దివ్యాంగులు అనే కనికరం కూడా చూపడం లేదు. దీంతో స్థానిక స్టేషన్లలో తమకు న్యాయం జరగదని భావించిన పలువురు ఎస్పీ కార్యాలయం మెట్లు ఎక్కుతున్నారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సోమవారం జిల్లాలోని పలుప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలపై అర్జీలు ఇచ్చారు. తర్వాత పలువురు మీడియాతో తమ ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు నెలలుగా తిరుగుతున్నా...

మూడు నెలలుగా తిరుగుతున్నా గార్లదిన్నె ఎస్‌ఐ(Garladinne SI) తనకు న్యాయం చేయడంలేదంటూ సంజీవపురానికి చెందిన బాధితురాలు బొగ్గు మంజుల వాపోయారు. తన భర్త భాస్కర్‌ మూడు నెలల కిందట ఓ అమ్మాయితో వెళ్లిపోయాడని తెలిపారు. ఈ సమస్యపై అడిగేందుకు గార్లదిన్నె పోలీస్టేషన్‌కు గత మూడు నెలలుగా తిరుగుతున్నానని వాపోయారు. ఎస్‌ఐ ఏమాత్రం స్పందించడం లేదని, పైగా మీ ఆయన నా జేబులో ఉన్నాడా అంటూ తిడుతున్నాడని ఆమె వాపోయారు. ఎంపీటీసీ విశ్వనాథ్‌, ఓ అమ్మాయి కుటుంబ సభ్యులతో డబ్బులు తీసుకుని వాళ్లకు అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

10 పరీక్షల ఫీజు చెల్లింపునకు 25 వరకు గడువు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 11 , 2025 | 12:32 PM