Chennai News: వీడికి ఇదేం పోయేకాలం.. 75 ఏళ్ల వయస్సులో.. 13 సంవత్సరాల బాలికపై..
ABN, Publish Date - Oct 10 , 2025 | 11:56 AM
ఆలయ దర్శనానికి వచ్చిన 13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుంభకోణం సమీపం తిరువలంసుళి గ్రామంలో వెయ్యేళ్ల పురాతనమైన వెల్ల వినాయకుడి ఆలయం ఉంది.
- లైంగిక వేధింపులకు పాల్పడ్డ 75 ఏళ్ల పూజారి అరెస్ట్
చెన్నై: ఆలయ దర్శనానికి వచ్చిన 13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుంభకోణం సమీపం తిరువలంసుళి గ్రామంలో వెయ్యేళ్ల పురాతనమైన వెల్ల వినాయకుడి ఆలయం ఉంది. ప్రసిద్ధిచెందిన ఈ ఆలయానికి ప్రతిరోజు భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు. ఈ క్రమంలో, ఈ నెల 8వ తేది రాత్రి 7గంటలకు సమీప గ్రా మానికి చెందిన ఓ కుటుంబం తమ 13 ఏళ్ల కుమార్తెతో ఆలయానికి వచ్చారు.
స్వామివారిని దర్శించుకున్న వారికి పూజారి విశ్వనాధన్ (75) తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ సమయంలో, బాలిక తన చేతిలో ఉన్న బ్యాగును పక్కన పెట్టి ప్రసాదాలు స్వీకరిం చి వెళ్లిపోయింది. ఆలయ ప్రాంగణాలు పరిశీలించిన కుటుంబం, హూండీలో నగదు వేసే సమయంలో, బ్యాగు మరిచిన విషయాన్ని గుర్తించిన బాలిక అక్కడకు వెళ్లింది.ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పూజారి విశ్వనాధన్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది.
ఏడుస్తూ వచ్చిన బాలికను విచారించిన తల్లిదండ్రులు, ఆమె చెప్పిన విషయం విని దిగ్ర్భాంతి చెంది ఆలయ నిర్వాహకులకు తెలిపారు. అధికారుల ఫిర్యాదుతో కుంభకోణం(Kumbhakonam) మహిళా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి విశ్వనాధన్‌ను అరెస్ట్ చేసి, వృద్ధాప్యం కారణంగా ఆయనను బెయిలుపై విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం కాన్వాయ్ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్ మరిచారు
భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త
Read Latest Telangana News and National News
Updated Date - Oct 10 , 2025 | 11:56 AM