Hyderabad: 6 కోట్ల స్కామ్.. గోవాలో నిందితుడి అరెస్టు.. ఏం జరిగిందంటే..
ABN, Publish Date - Sep 30 , 2025 | 07:59 AM
పెట్టుబడి పేరుతో రూ.6 కోట్ల మేర మోసం చేసిన నిందితుల్లో ఒకరిని సైబరాబాద్ పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆర్థిక నేరాల విభాగం డీసీపీ ముత్యం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చందానగర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి అఖిల్‌కు పెట్టుబడికి 30 నుంచి 48 శాతం వరకు వార్షిక రాబడి ఇస్తామని నమ్మించి కొందరు డిపాజిట్లు సేకరించారు.
- పరారీలో ప్రధాన నిందితుడు
హైదరాబాద్ సిటీ: పెట్టుబడి పేరుతో రూ.6 కోట్ల మేర మోసం చేసిన నిందితుల్లో ఒకరిని సైబరాబాద్ పోలీసులు గోవా(Goa)లో అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆర్థిక నేరాల విభాగం డీసీపీ ముత్యం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చందానగర్(Chandanagar)కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి అఖిల్‌కు పెట్టుబడికి 30 నుంచి 48 శాతం వరకు వార్షిక రాబడి ఇస్తామని నమ్మించి కొందరు డిపాజిట్లు సేకరించారు.
నిందితులు పిబ్‌వేవ్ ఎనలిటిక్స్ ఎల్‌ఎల్‌పీ సంస్థ పేరుతో ప్రచారం చేశారు. వెల్స్ ఫార్గోలో మాజీ ఉద్యోగి గోయెల్ తన స్నేహితులు, మాజీ సహ ఉద్యోగులతో కలిసి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. పెట్టుబడి దారులను ఆకర్షించారు. తొలుత వారి నమ్మకం పొందేందుకు కొన్ని నెలల పాటు చెల్లింపులు చేసి ఆపై ఆపేశారు.
50 మందికి పైగా బాధితులు
విచారణలో భాగంగా నిందితుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. 13 మంది బాధితుల డాక్యుమెంట్లను పరిశీలిస్తే రూ.3.33 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు వెల్లడైంది. ఇంకా బాధితులు 50-60 మంది వరకు ఉన్నారని, అందరివీ కలిపి రూ.6 కోట్లకు పైగానే ఉంటాయని డీసీపీ ముత్యం రెడ్డి తెలిపారు. విచారణ సమయంలో సంస్థకు చెందిన ఇండస్ ఇండ్ బ్యాంక్ ఖాతాలో పెద్ద మొత్తంలో డిపాజిట్లు బయటపడ్డాయని,
దర్యాప్తు బృందం పరిశీలిస్తోందని తెలిపారు. ఈనెల 27న ఉత్తర గోవాలోని దేవశ్రీ గ్రీన్స్ హెచ్-104 ఫ్లాట్‌లో నిందితుడు సైరస్ ఆర్మూ్‌సజిని అరెస్టు చేశామని, అతడిని గోవాలో జ్యుడిషియల్ మెజిస్ర్టేట్ ముందు హజరుపర్చి నగరానికి తీసుకువచ్చి విచారించామని డీసీపీ తెలిపారు. విచారణలో నిఖిల్‌కుమార్ గోయెల్ 2017 నుంచే మోసాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిసిందన్నారు. అతడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 30 , 2025 | 07:59 AM