ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: అంతడబ్బు తీసుకెళుతూ.. కొంచెం జాగ్రత్తగా ఉండొద్దా నాయనా.. ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Mar 18 , 2025 | 01:22 PM

ఎటువంటి పత్రాలు లేకుండా రైలులో తరలిస్తున్న రూ.13.77 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యాపారి తన వ్యాపార అవసరాల నిమిత్తం నగదునే తీసుకుని రైలు ఎక్కాడు. అయితే.. రైలులో గంజాయి సరఫరా సమాచారంతో తనిఖీలు చేస్తుండగా ఈ నగదు వ్యవహారం బయటపడింది.

- రైలులో తరలిస్తున్న రూ.13.77 లక్షలు స్వాధీనం

- వ్యాపారి అరెస్టు

చెన్నై: తిరుక్కురళ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు(Thirukkural Express Train)లో ఎలాంటి పత్రాలు లేకుండా ఓ వ్యాపారి తరలిస్తున్న రూ.13.77 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుండి కన్నియాకుమారి వెళ్లే తిరుక్కురళ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆదివారం దిండుగల్‌ రైల్వేస్టేషన్‌(Dundigal Railway Station)లో ఆగినప్పుడు ఆ రైలులో భారీగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో తిరుచ్చి రైల్వే ఎస్పీ రాజన్‌(Railway SP Rajan) ఆదేశాల మేరకు సీఐ తూయమణి తన బృందంతో ఆ రైలులో ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP Leader: పోలీసులపై బీజేపీ నేత ఆగ్రహం.. కుక్కల వ్యాన్‏లో ఎక్కమంటారా..


ఆ సందర్భంగా ఓ బోగీలో ప్రయాణిస్తున్న కన్నియాకుమారి(Kanniyakumari) జిల్లా కల్‌కుళం ప్రాంతానికి చెందిన నవనీత కృష్ణన్‌ అనే వ్యాపారి బ్యాగ్‌ను పోలీసులు తనిఖీ చేయగా అందులో రూ.13.77లక్షల వరకు కొత్త ఐదువందల నోట్ల కట్టలు లభించాయి. ఆ నగదుకు సంబంధించి నవనీత కృష్ణన్‌ వద్ద ఎలాంటి రశీదు లేకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు ఆయన వద్ద విచారణ జరిపినప్పుడు విదేశీ కరెన్సీని ఇండియన్‌ కరెన్సీగా మార్చే ఏజెంట్‌ వ్యాపారం చేస్తున్నాడని, ఇటీవల విదేశీ కరెన్సీ మార్చి ఇచ్చినందుకు వచ్చిన కమిషన్‌ సొమ్మును స్వస్థలానికి తీసుకెళుతున్నాని తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

టన్నుల్లో స్మగ్లింగ్‌.. గ్రాముల్లో పట్టివేత

టికెట్‌ సొమ్ము వాపస్ కు 3 రోజులే గడువు


ఛీ.. మీరసలు మనుషులేనా.. ఇంత దారుణమా..

వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 18 , 2025 | 01:22 PM