ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Upcoming IPOs June 2025: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. 10 కంపెనీల లిస్టింగ్..

ABN, Publish Date - Jun 01 , 2025 | 11:43 AM

దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల (Upcoming IPOs June 2025) వారం వచ్చేసింది. ఈసారి కొత్త ఐపీఓలు తక్కువగా ఉన్నాయి. కానీ రాబోయే వారంలో (జూన్ 2 నుంచి) కొత్త కంపెనీలు ఎక్కువగా లిస్ట్ కానున్నాయి. ఆయా కంపెనీలు ఏంటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

upcoming IPOs June 2025

భారత స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల వీక్ రానే వచ్చింది. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే వారం ఈసారి సందడిగా ఉండనుంది. ఈ నెలలో మొదటి ట్రేడింగ్ వీక్ రావడంతో అనేక IPOలు (Upcoming IPOs June 2025) మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. స్క్లాస్ బెంగళూరు (లీలా హోటల్స్), ఏజిస్ వోపాక్ టెర్మినల్స్, ప్రోస్టార్ఎమ్ ఇన్ఫో సిస్టమ్స్, స్కోడా ట్యూబ్స్ షేర్లు మెయిన్‌బోర్డ్ విభాగంలో లిస్ట్ అవుతాయి. అదే సమయంలో ప్రోస్టార్ఎమ్ ఇన్ఫో సిస్టమ్స్ షేర్లు కూడా మార్కెట్లోకి రానున్నాయి. అయితే ఈసారి రానున్న కొత్త ఐపీఓల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


కొత్త ఐపీఓలు..

గంగా బాత్ ఫిట్టింగ్స్ ఐపీఓ: రూ. 32.65 కోట్ల ఈ పబ్లిక్ ఇష్యూ జూన్ 4న ప్రారంభమవుతుంది. ఇందులో, జూన్ 6 వరకు షేరుకు రూ. 46-49 ధరతో 3000 లాట్లలో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఈ IPOలో 66.63 లక్షల కొత్త షేర్లను జారీ చేస్తారు. జూన్ 9న కేటాయింపును ఖరారు చేయవచ్చు. ఆ తర్వాత జూన్ 11న NSE SMEలో షేర్ల లిస్టింగ్ అవుతుంది.


3B ఫిల్మ్స్ IPO: ఈ పబ్లిక్ ఇష్యూ మే 30న మొదలు కాగా, జూన్ 3న ముగుస్తుంది.ఈ కంపెనీ రూ.33.75 కోట్లు సేకరించాలని భావిస్తోంది. రూ.15.99 కోట్ల విలువైన 31.98 లక్షల షేర్లను, రూ.17.76 కోట్ల విలువైన 35.52 లక్షల కొత్త షేర్లను అమ్మకానికి ఆఫర్ చేశారు. ఈ IPOను రూ.50 ధరకు 3000 లాట్లలో బిడ్‌లు వేయవచ్చు. జూన్ 4న కేటాయింపు జరగనుంది. షేర్లు జూన్ 6న BSE SMEలో లిస్ట్ కానున్నాయి.


లిస్ట్ కానున్న కంపెనీలు

కొత్త వారంలో జూన్ 2న, లీలా హోటల్స్, ఏజిస్ వోపాక్ టెర్మినల్స్ షేర్లు BSE, NSEలలో మెయిన్‌బోర్డ్ విభాగంలోకి ఎంట్రీ ఇస్తాయి. జూన్ 3న, ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ BSE, NSEలలో జాబితా చేయబడతాయి. అదే రోజున, నికితా పేపర్స్, బ్లూ వాటర్ లాజిస్టిక్స్ షేర్లు NSE SMEలో లిస్ట్ అవుతాయి. అదే రోజున, ఆస్టోనా ల్యాబ్స్ కంపెనీ BSE SMEలో అడుగుపెడుతుంది. స్కోడా ట్యూబ్స్ షేర్లు జూన్ 4న BSE, NSEలలో జాబితా చేయబడుతుంది. అదే రోజున, NR వందన టెక్స్‌టైల్, నెప్ట్యూన్ పెట్రోకెమికల్స్ షేర్లు జూన్ 4న NSE SMEలో లిస్ట్ కానున్నాయి.

గమనిక: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేయాలని ఆంధ్రజ్యోతి సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. మీకు ఇన్వెస్ట్ చేయాలని ఆసక్తి ఉంటే నిపుణుల సలహా, సూచనలు తీసుకోవడం మంచిది.


ఇవీ చదవండి:

నేడు పంజాబ్ vs ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్

జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 11:43 AM