Trump No Tariffs Gold: సుంకాలు లేవంటూ ట్రంప్ ప్రకటన..బంగారం ధర మరింత తగ్గనుందా..
ABN, Publish Date - Aug 12 , 2025 | 12:32 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారంపై ఎలాంటి సుంకాలు వేయబోనని కీలక ప్రకటన చేశారు. దీంతో బంగారం ధరలు ఊహించని విధంగా పడిపోయాయి. అయితే భవిష్యత్తులో వీటి ధరలు ఇంకా తగ్గుతాయా లేదా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా ఉత్పత్తుల విషయంలో 50 శాతం సుంకాలు విధించనున్నట్లు ఇప్పటికే తెలిపారు. కానీ బంగారంపై మాత్రం ఈ సుంకాలు ఉండవని సోషల్ మీడియా ట్రూత్ వేదికగా (Trump No Tariffs Gold) వెల్లడించారు. దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగిన ఊహాగానాలకు బ్రేక్ పడింది. ఈ వార్త విన్న తర్వాత బంగారం ధరలు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. బదులుగా బంగారం ధర ఒక్క రోజులోనే 1.6% పడిపోయి, ఔన్స్‌కు $3,350 స్థాయికి చేరుకుంది. ఇది మే 14 తర్వాత అతిపెద్ద క్షీణత అని చెప్పుకోవచ్చు.
సుంకాల గందరగోళం
ఈ గందరగోళం శుక్రవారం యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) జారీ చేసిన ఒక ప్రకటనతో మొదలైంది. స్విట్జర్లాండ్ నుంచి వచ్చే కిలో, 100 ఔన్సుల బంగారు కడ్డీలపై 39% సుంకం విధిస్తామని వాళ్లు చెప్పారు. ఇది స్విట్జర్లాండ్‌కు బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో దాదాపు 70% బంగారాన్ని ఈ దేశమే రిఫైన్ చేస్తుంది.
ఈ బంగారం చాలావరకు అమెరికాకు ఇన్వెస్ట్‌మెంట్, ఇండస్ట్రీ ఉపయోగాల కోసం వెళ్తుంది. ఒకవేళ స్విస్ బంగారంపై సుంకాలు పడితే, గ్లోబల్ బులియన్ మార్కెట్‌లో కూడా మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ వార్తతో బంగారం ప్రియులు, ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళనలో పడ్డారు. ట్రంప్ స్వయంగా బంగారంపై సుంకాలు లేవని క్లారిటీ ఇవ్వడంతో ఆ భయాలు పూర్తిగా తొలగిపోయాయి.
బంగారం ధర ఎందుకు పడిపోయింది?
అయితే సుంకాలు లేవని ట్రంప్ చెప్పినా కూడా బంగారం ధర పెరగలేదు, కానీ డ్రాప్ అయ్యింది. దీనికి కొన్ని కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది బంగారం ధర ఇప్పటికే 27% పెరిగింది. ఇది బిట్‌కాయిన్ గెయిన్స్‌తో సమానం, S&P 500 ఇండెక్స్‌లోని 9% రిటర్న్‌ను కూడా బీట్ చేసింది. ఇంత భారీ గెయిన్స్ తర్వాత, సుంకాల భయం తొలగిపోయింది కాబట్టి, ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకునేందుకు వెనక్కి తగ్గారు.
స్థిరంగా ధరలు..
బంగారం అంటే సేఫ్ హెవెన్ ఆస్తి. సుంకాల భయం ఉన్నప్పుడు దీని డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ సుంకాలు లేవని చెప్పడంతో, ఆ భయం తగ్గిపోయి, బంగారం కొనాలనే ఆసక్తి ఇన్వెస్టర్లలో తగ్గింది. సుంకాలు లేనందున బంగారం ధరలు స్థిరంగా ఉంటాయని మార్కెట్ భావించింది. దీంతో కొత్తగా కొనుగోళ్లు చేసే ఉత్సాహం తగ్గింది.
ధరలు ఇంతకంటే ఎక్కువ పెరగవని ట్రేడర్లు భావించి ఉండొచ్చు. బంగారం ధరలు ఇప్పటికీ హై లెవెల్స్‌లో ఉన్నాయి. కానీ ఈ ఒక్క రోజు డ్రాప్‌తో పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బంగారం ఎప్పుడూ లాంగ్-టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఉపయోగపడుతుంది. మరికొంత మంది నిపుణులు మాత్రం రానున్న రోజుల్లో పసిడి ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 12 , 2025 | 12:33 PM