Safest Airlines: ప్రపంచంలో టాప్ 10 సురక్షిత విమానయాన సంస్థలు.. ఎయిర్ ఇండియా ఉందా లేదా
ABN, Publish Date - Jun 18 , 2025 | 01:57 PM
గత కొన్ని రోజులుగా సాంకేతిక సమస్యలు సహా పలు కారణాలతో అనేక విమానాలు రద్దు కావడం వంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే అసలు ప్రపంచవ్యాప్తంగా సేఫెస్ట్ విమానయాన సంస్థలు (Safest Airlines) ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థల భద్రతా ప్రమాణాలు నిర్ధారించడానికి AirlineRatings.com ప్రతి సంవత్సరం ర్యాంకింగ్స్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికులకు అనుగుణంగా పలు రకాల అంశాలతో జాబితాను విడుదల చేస్తుంది. అయితే ఈసారి 2025కు సంబంధించి కూడా కొత్త జాబితాను విడుదల చేయగా, అందులో ఏయే సంస్థలు (Safest Airlines) ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ప్రపంచంలోని టాప్ 10 విమానయాన సంస్థలు
Air New Zealand
Qantas
Cathay Pacific, Qatar Airways, Emirates (మూడింటి మధ్య సమాన స్కోరు)
Virgin Australia
Etihad Airways
All Nippon Airways (ANA)
EVA Air
Korean Air
Alaska Airlines
Turkish Airlines
ఏ ఒక్కటి కూడా
ఈ ర్యాంకింగ్స్‌లో భారతీయ సంస్థలలో ఏ ఒక్కటి కూడా చోటు సంపాదించలేదు. అయితే Air India గతంలో ఈ ర్యాంకింగ్స్‌లో స్థానం పొందినప్పటికీ, ఈ సంవత్సరం మాత్రం ఈ జాబితాలో లేదు.
లో కాస్ట్ సంస్థలు
ప్రపంచంలోని అత్యంత భద్రత కలిగిన లో కాస్ట్ విమానయాన సంస్థల లిస్ట్ కూడా వెలుగులోకి వచ్చింది. లో కాస్ట్ విమానయాన సంస్థల భద్రతా ర్యాంకింగ్స్‌లో IndiGo భారతదేశం నుంచి ఏకైక సంస్థగా 19వ స్థానంలో నిలిచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 25లో కాస్ట్ సంస్థలలో ఒకటిగా నిలిచింది.
ఇతర టాప్ 10లో-కాస్ట్ సంస్థలు
HK Express
Jetstar Group
Ryanair
easyJet
Frontier Airlines
AirAsia
Wizz Air
VietJet Air
Southwest Airlines
Volaris
భారతీయ ప్రధాన విమానయాన సంస్థల భద్రతా రేటింగ్స్
AirlineRatings.com 7 స్టార్ భద్రతా రేటింగ్ వ్యవస్థను ఉపయోగించి భారతదేశంలోని ప్రధాన విమానయాన సంస్థల భద్రతా స్థాయిలను ఈ విధంగా రేటింగ్ చేసింది
SpiceJet: 7/7 స్టార్
IndiGo: 6/7 స్టార్
Akasa Air: 6/7 స్టార్
Air India: ఈ రేటింగ్‌లో స్థానం లేదు
SpiceJet తన చిన్న ఫ్లీట్ పరిమాణం కారణంగా మంచి భద్రతా రేటింగ్‌ను పొందింది. Akasa Air 6/7 స్టార్ రేటింగ్‌ను పొందింది. కానీ IOSA (International Air Services Audit) సర్టిఫికేషన్ లేకపోవడం కారణంగా ఒక స్టార్ తగ్గింది. IndiGo కూడా 6/7 స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇది దీని పెద్ద ఫ్లీట్ పరిమాణం కారణంగా సాధ్యమైంది.
ఎలా పరిగణిస్తారు
AirlineRatings.com విమానయాన సంస్థల భద్రతను నిర్ధారించడానికి వివిధ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటుంది. గత రెండు సంవత్సరాలలో తీవ్రమైన ప్రమాదాలు, సామాన్య ప్రమాదాల రేటు, తాజా మరణాల ఘటనలు, రెగ్యులేటరీ ఆడిట్లు, ఫ్లీట్ వయస్సు, పరిమాణం, పైలట్ శిక్షణ ప్రమాణాలు, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలను పరిశీలిస్తుంది. ఈ ప్రమాణాల ఆధారంగా, IndiGo 6/7 స్టార్ రేటింగ్‌ను పొందింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News
Updated Date - Jun 18 , 2025 | 01:58 PM