Silver Price: వెండి దూకుడు.. గరిష్ఠ స్థాయిని చేరి.. ఆపై..
ABN, Publish Date - Dec 29 , 2025 | 02:30 PM
అంతర్జాతీయ మార్కెట్‌లో సోమవారం వెండి రేటు సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. నేటి ట్రేడింగ్‌లో 80 డాలర్ల మార్కును దాటిన కాసేపటికి ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో మళ్లీ 80 డాలర్ల దిగువకు పడిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికి అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర దూసుకెళ్లింది. 80 డాలర్ల మార్కును అధిగమించి ఒకానొక దశలో 82.15 డాలర్లకు చేరింది. పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్, తగ్గిన సరఫరా వెరసి ధర కొత్త పుంతలు తొక్కింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు కోత ఈ జోరుకు ఆజ్యం పోసింది. వెండితో పాటు ప్లాటినం ధర కూడా స్వల్పంగా పెరిగినప్పటికీ ఆ తరువాత మళ్లీ తగ్గుముఖం పట్టింది (Silver Price Surge Record High on Dec 29)
సిల్వర్ ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ధరల్లో 1.3 శాతం మేర కోత పడి చివరకు 78.12 డాలర్ల వద్దకు చేరింది. అటు ప్రాఫిట్ బుకింగ్ ఇటు అమెరికా వెండిని క్రిటికల్ ఖనిజంగా వర్గీకరించడం నేటి ధరల గమనాన్ని నిర్దేశించాయని మార్కెట్ నిపుణులు కామెంట్ చేస్తున్నారు. .
బంగారం కూడా నేడు గరిష్ఠ ధరలను తాకినప్పటికీ ఆ తరువాత జోరు తగ్గడంతో 0.1 శాతం మేర ధరలో కోతపడింది. బంగారం ధరలపై పలు అంశాలు తమ ప్రభావం చూపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. యూఎస్ ఫెడ్ రేట్ కోతపై పెరుగుతున్న అంచనాలు, యూఎస్ సెక్యూరిటీస్‌కు బదులు బంగారం, వెండివైపు సెంట్రల్ బ్యాంకులు మళ్లడం వంటి అంశాలు ఇటీవలి కాలంలో ధరల పెంచాయి. వచ్చే ఏడాది మరో రెండు మార్లు ఫెడ్ రేటు కోతలు తప్పని ఇన్వెస్టర్లు విశ్వసిస్తున్నారు. బంగారం, వెండిపై పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. ఇక భౌగోళిక రాజకీయాలు కూడా ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. యుద్ధం ముగింపునకు సంబంధించి తాను, జెలెన్స్‌స్కీ త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కూడా కామెంట్ చేశారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండితో పాటు ప్లాటినమ్, పెలాడియం ఖనిజాల ధరలు కూడా నేడు స్వల్పంగా తగ్గాయి. దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు నేడు దిగొచ్చాయి. పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో ధరల్లో స్వల్పంగా కోత పడింది
ఇవీ చదవండి:
ఈ విషయాలు తెలుసా? పర్సనల్ లోన్ చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే..
ఎన్నో రోజుల తరువాత ఊరట.. గోల్డ్ రేట్స్ డౌన్!
Updated Date - Dec 29 , 2025 | 02:32 PM