Gold, Silver Rates Dec 29: ఎన్నో రోజుల తరువాత ఊరట.. గోల్డ్ రేట్స్ డౌన్!
ABN , Publish Date - Dec 29 , 2025 | 12:44 PM
వినియోగదారులకు గుడ్ న్యూస్. కొత్త ఏడాదిలో కాలుపెడుతున్న వేళ గోల్డ్, సిల్వర్ రేట్స్ నేడు స్వల్పంగా తగ్గాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: పది రోజులుగా వరుసపెట్టి పెరిగిన గోల్డ్ రేట్స్ ఎట్టకేలకు తగ్గాయి. వెండి ధరలు కూడా వినియోగదారులకు ఊరటనిస్తూ తగ్గుముఖం పట్టాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.870 మే తగ్గి రూ.1,42,040కు చేరుకుంది. మరోవైపు, 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.800 మేర తగ్గి రూ.1,30,200కు చేరింది (Gold, Silver Rates on Dec 29).
బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.710 మేర తగ్గి రూ.1,41,710కు చేరుకుంది. 22 క్యారెట్ గోల్డ్ ధర కూడా 1,29,900కు చేరింది. మరోవైపు, వెండి ధర కూడా దిగొచ్చింది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర రూ.4000 మేర తగ్గి రూ.2,58,000కు చేరుకుంది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వివిధ నగరాల్లో బంగారం (24కే, 22కే, 18కే) ధరలు
చెన్నై: ₹1,42,040; ₹1,30,200; ₹1,08,650
ముంబై: ₹1,41,710; ₹1,29,900; ₹1,06,280
న్యూఢిల్లీ: ₹1,41,860; ₹1,30,050; ₹1,06,330
కోల్‌కతా: ₹1,41,710; ₹1,29,900; ₹1,06,280
బెంగళూరు: ₹1,41,710; ₹1,29,900; ₹1,06,280
హైదరాబాద్: ₹1,41,710; ₹1,29,900; ₹1,06,280
విజయవాడ: ₹1,41,710; ₹1,29,900; ₹1,06,280
కేరళ: ₹1,41,710; ₹1,29,900; ₹1,06,280
పుణె: ₹1,41,710; ₹1,29,900; ₹1,06,280
వడోదరా: ₹1,41,760; ₹1,29,950; ₹1,06,330
అహ్మదాబాద్: ₹1,41,760; ₹1,29,950; ₹1,06,330
వెండి ధరలు ఇవీ
చెన్నై: ₹2,81,000
ముంబై: ₹2,58,000
న్యూఢిల్లీ: ₹2,58,000
కోల్‌కతా: ₹2,58,000
బెంగళూరు: ₹2,58,000
హైదరాబాద్: ₹2,81,000
విజయవాడ: ₹2,81,000
కేరళ: ₹2,81,000
పుణె: ₹2,58,000
వడోదరా: ₹2,58,000
అహ్మదాబాద్: ₹2,58,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి, బంగారం కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి పరిశీలించగలరు.
ఇవీ చదవండి:
ఈ విషయాలు తెలుసా? పర్సనల్ లోన్ చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే..
రక్షణ రంగంలో అదానీ గ్రూప్ రూ.1.8 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు