ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Investment Tips: రూ. 12,000 నెలవారీ పెట్టుబడితో ఇలా రూ. 10 కోట్లు పొందండి..

ABN, Publish Date - Jun 29 , 2025 | 08:34 AM

మీరు నెలకు కొంత పెట్టుబడి పెట్టి భవిష్యత్‌లో కోటీశ్వరులు కావాలని చూస్తున్నారా. ఈ కలను ఎలా నిజం చేసుకోవాలని ఆలోచిస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే (Investment Tips). ఎందుకంటే ఇక్కడ చెప్పిన దాని ప్రకారం మీరు నెలకు కొంత ఇన్వెస్టే చేస్తే రూ.10 కోట్లు పొందే ఛాన్సుంది. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Investment Tips

మీరు కొంత నెలవారీ పెట్టుబడితో కోట్ల రూపాయలు ఎలా సృష్టించాలని (Investment Tips) ఆలోచిస్తున్నారా. అయితే దీని కోసం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలో మార్కెట్ హెచ్చుతగ్గుల గురించి ఆందోళన చెందకుండా మీరు సంపదను పెంచుకోవచ్చు. దీని ద్వారా నెలకు రూ. 12,000 ఇన్వెస్ట్ చేయడం ద్వారా, ఏకంగా 10 కోట్ల రూపాయలు దక్కించుకునే ఛాన్సుంది. మీరు దీన్ని సాధించాలంటే అనుకున్న ప్రకారం పెట్టుబడులు పెట్టాలి. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

SIP అంటే ఏమిటి?

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అనేది మీరు మ్యూచువల్ ఫండ్లలో క్రమం తప్పకుండా ఒక పెట్టుబడి మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడానికి అనుమతించే పథకం. దీనిలో మీరు రోజూ, వారం, నెలవారీ, త్రైమాసికంగా లేదా సంవత్సరానికి ఒకసారి పెట్టుబడి చేయవచ్చు. ఈ పథకం అద్భుతమైన విషయం ఏమిటంటే, మీరు కేవలం రూ. 100 వంటి చిన్న మొత్తంతో కూడా పెట్టుబడిని ప్రారంభించవచ్చు.

మీ బ్యాంకు ఖాతా నుంచి నిర్దిష్ట మొత్తం ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది. అది మీరు ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిగా చేరుతుంది. సిప్ విధానంలో కాంపౌండింగ్ పద్ధతిలో మీ పెట్టుబడి పెరుగుతుంది. అంటే మీ పెట్టుబడి ప్రధాన మొత్తంపై మాత్రమే కాకుండా, ఆ మొత్తంపై వచ్చే లాభాలపై కూడా రాబడి వస్తుంది. దీనిలో తొందరగా పెట్టుబడి ప్రారంభించడం ద్వారా దీర్ఘకాలంలో భారీ మొత్తాలను పొందవచ్చు.

ఏన్నేళ్లు చేయాలి..

మీరు రూ. 10 కోట్ల మొత్తాన్ని దక్కించుకోవాలంటే నెలకు రూ. 12,000ను 39 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి (Investment Tips) ఉంటుంది. ఇక్కడ వార్షిక వడ్డీ రేటు 12 శాతం చొప్పున లెక్కించుకంటే మీకు రూ. 10,47,88,977 లభిస్తుంది. అంటే మీరు 39 ఏళ్లలో చేసిన పెట్టుబడి రూ. 56,16,000 కాగా, మీకు రూ. 10 కోట్లకుపైగా వస్తాయి. ఇక్కడ మీకు వడ్డీ రూపంలోనే రూ. 9,91,72,977 లభిస్తాయి. తక్కువ వయస్సులో ఉన్నప్పుడు ఈ విధానం పాటిస్తే దీర్ఘకాలంలో భారీ మొత్తాలను పొందవచ్చు. ఇదే విధానంలో 30 సంవత్సరాలలో రూ. 12,000 నెలవారీ SIP చేస్తే, మీకు రూ. 3,69,71,679 వచ్చే ఛాన్సుంది. ఇక్కడ మీరు చేసిన పెట్టుబడి రూ. 43,20,000.

గమనిక: స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు చేయాలని ఆంధ్రజ్యోతి సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. మీకు ఇన్వెస్ట్ చేయాలని ఆసక్తి ఉంటే, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

ఇవీ చదవండి:

కొత్త ఫ్లాష్ సేల్ ఆఫర్.. రూ.400కు 400 జీబీ డేటా

సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 29 , 2025 | 08:34 AM