Pure EV: జియోథింగ్స్‌తో జత కట్టిన ప్యూర్ ఈవీ.. ఎలక్ట్రిక్ వాహన రంగంలో కీలక మార్పు..
ABN, Publish Date - Feb 18 , 2025 | 03:35 PM
ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ల సంస్థ ప్యూర్ ఈవీ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించడానికి జియో ప్లాట్‌ఫామ్స్ అనుబంధ సంస్థ జియో థింగ్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
భారత్‌లో ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ప్యూర్ ఈవీ(Pure EV), జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌కు చెందిన జియో థింగ్స్( JioThings) లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ప్యూర్ ఈవీ తమ ఎలక్ట్రిక్ వాహనాల్లో జియో థింగ్స్ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్లు, టెలీమ్యాటిక్స్ ఫీచర్లను అందిస్తారు. ఈ టెక్నాలజీ ఫీచర్ల ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించడంతోపాటు, ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సేవలను ఉపయోగించుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది.
మెరుగైన సౌకర్యం..
ఈ క్రమంలో ప్యూర్ ఈవీ తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పనితీరు, ఇంటరాక్టివిటీని మెరుగుపరచుకునేందుకు జియోథింగ్స్ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్లను అనుసంధానిస్తున్నట్లు తెలిపింది. దీంతో 4జీ కనెక్టివిటీ ఆధారిత టెలీమ్యాటిక్స్ ద్వారా వినియోగదారులు రియల్ టైమ్‌లో వాహన పనితీరును పర్యవేక్షించుకోవచ్చు. తద్వారా వారు మరింత మెరుగైన సౌకర్యాన్ని పొందుతారు. ప్రస్తుతం జియోథింగ్స్ 4జీ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ (AOSP) ఆధారిత AvniOSను ఉపయోగిస్తుంది.
ఇది వినియోగదారులకు రియల్ టైమ్ డేటా అనలిటిక్స్, ద్విచక్ర వాహన ఇంటర్‌ఫేస్ కస్టమైజేషన్, ఫుల్ హెచ్‌డీ+ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, కంపాటిబిలిటీ వంటి అనేక సౌకర్యాలను అందిస్తుంది. ఈ డిజిటల్ క్లస్టర్ ఓఈఎంలు తమ ఉత్పత్తుల్లో ఐవోటీ సొల్యూషన్స్‌ను అనుసంధానించడానికి వేగవంతమైన ప్రక్రియను అందిస్తాయి.
నేవిగేషన్, గేమింగ్..
జియో ఆటోమోటివ్ యాప్ సూట్ (JAAS) అనేది వాహనాల్లో అనుసంధానించబడిన మరొక సొల్యూషన్. ఇది ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాల యూజర్ల కోసం రూపొందించబడింది. ఇందులో జియోస్టోర్, మ్యూజిక్ స్ట్రీమింగ్, వెబ్ బ్రౌజింగ్, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్టెన్స్, నేవిగేషన్, గేమింగ్ వంటి అనేక ఉత్పత్తులు, సొల్యూషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
అత్యుత్తమ ప్రమాణాలతో..
జియోథింగ్స్ ఐవోటీ సామర్థ్యాలను మా వాహనాల్లో పొందుపర్చడం ద్వారా ప్యూర్ ఈవీ ఉత్పత్తులు అత్యుత్తమ ప్రమాణాలతో మారుతాయని ఈ సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ Dr. నిశాంత్ దొంగారి తెలిపారు. ఈ క్రమంలో మా వాహనాల సామర్థ్యాలు, ఇంటరాక్టివిటీని మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీ, మంచి పనితీరు, సౌలభ్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు నిశాంత్ దొంగారి స్పష్టం చేశారు.
పర్యావరణ అనుకూలం..
ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కొత్త ఆవిష్కరణలతోపాటు, మంచి ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతో ప్యూర్ ఈవీతో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషకరమైన విషయమని జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్ ఆశీష్ లోధా తెలిపారు. ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడంతోపాటు పర్యావరణ అనుకూల రవాణా వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు తోడ్పడనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా విరాట్ కోహ్లీ ముందు 5 రికార్డులు.. బ్రేక్ చేస్తాడా..
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 18 , 2025 | 03:36 PM