Share News

Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా విరాట్ కోహ్లీ ముందు 5 రికార్డులు.. బ్రేక్ చేస్తాడా..

ABN , Publish Date - Feb 18 , 2025 | 02:46 PM

రేపటి (ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించనున్నారు. అంతేకాదు విరాట్ మరిన్ని పరుగులు చేయడం ద్వారా ఐదు రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా విరాట్ కోహ్లీ ముందు 5 రికార్డులు.. బ్రేక్ చేస్తాడా..
Virat Kohli

భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రేపటి (ఫిబ్రవరి 19) నుంచి మొదలయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (2025 Champions Trophy)లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ టోర్నీలో కోహ్లీ అనేక రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 297 వన్డే మ్యాచ్‌లలో 13,963 పరుగులు చేసిన విరాట్, ఈ టోర్నీలో మరిన్ని రికార్డులను దక్కించుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.


1. అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్

ప్రస్తుతం కోహ్లీ వన్డే క్రికెట్‌లో 14,000 పరుగుల మార్కుకు చాలా దగ్గరగా ఉన్నాడు. ప్రస్తుతం 13,963 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీలో మరో 37 పరుగులు సాధిస్తే, వన్డేలో అత్యంత వేగంగా 14,000 పరుగులు సాధించిన ఆటగాడిగా విరాట్ అరుదైన ఘనతను దక్కించుకుంటాడు. ఇప్పటికే 14,000 పరుగుల మార్కును సచిన్ టెండూల్కర్ (359 వన్డే మ్యాచ్‌లు), కుమార్ సంగక్కర (402 వన్డే మ్యాచ్‌లు)లలో సాధించారు. కానీ కోహ్లీ ప్రస్తుతం 285 ఇన్నింగ్స్‌లలోనే 13,963 పరుగులు చేయడం విశేషం.


2. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు

2008లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 27,381 పరుగులు చేసి, ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో మరో 103 రన్స్ చేస్తే, విరాట్ రికీ పాంటింగ్‌ను అధిగమిస్తాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో మూడో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు. పాంటింగ్ 27,483 పరుగులతో ఈ రికార్డును కలిగి ఉన్నాడు.


3. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు

2009లో భారత జట్టు తరపున ఛాంపియన్స్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన కోహ్లీ, ఇప్పటివరకు 13 మ్యాచ్‌లలో 529 పరుగులు సాధించాడు. ప్రస్తుతం యాక్టివ్ ప్లేయర్లలో విరాట్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో కనీసం 263 పరుగులు చేయగలిగితే, అతను వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్రిస్ గేల్ (791 పరుగులు) రికార్డును అధిగమించి, ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని సమయాల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.


4. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక 50లు

13 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లలో కోహ్లీ 5 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ టోర్నీలో విరాట్ మరో రెండు హాఫ్ సెంచరీలు చేస్తే, అతను రాహుల్ ద్రవిడ్ 6 హాఫ్ సెంచరీల రికార్డును అధిగమించి, ఈ టోర్నీలో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు.


5. అత్యధిక ఐసీసీ ట్రోఫీలు

2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో కోహ్లీ ఐసీసీ టోర్నమెంట్‌లలో అత్యధిక ట్రోఫీలు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కోహ్లీ 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2024లో టీ20 ప్రపంచకప్, 2008లో అండర్ 19 ప్రపంచకప్‌ను గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 3 వన్డే ప్రపంచకప్‌లను (1999, 2003, 2007), రెండు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను (2006, 2009) గెలిచాడు.


ఇండియా మ్యాచులు మొత్తం..

ఈ టోర్నమెంట్‌లో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. భారత జట్టు తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ తర్వాత కోహ్లీ ఫామ్‌లో కొంత ఇబ్బందులకు గురైనప్పటికీ, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో తిరుగులేని ప్రదర్శన చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి క్రీడా వర్గాలు. దీంతో అనేక మంది క్రీడాభిమానులు విరాట్ రికార్డులపై బెట్టింగ్స్ చేయడం మొదలుపెట్టారు.


ఇవి కూడా చదవండి:


Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..


New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..

New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 18 , 2025 | 02:47 PM