New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
ABN , Publish Date - Feb 10 , 2025 | 06:54 PM
దేశ రాజధాని ఢిల్లీ అరుదైన ఘనతను దక్కించుకుంది. ఈ క్రమంలో లగ్జరీ హౌసింగ్ ఇళ్ల విషయంలో 6.7% ధరల పెరుగుదలని నమోదు చేసింది. దీంతో గత ఏడాది 16వ స్థానంలో ఉన్న నగరం, ఈసారి ఆరో స్థానానికి చేరుకుంది.

లగ్జరీ గృహాల ధరల పెరుగుదల విషయంలో కీలక నివేదిక వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయి గృహాల ధరల పెరుగుదలలో న్యూఢిల్లీ (New Delhi ) 44 నగరాల్లో ఆరో స్థానంలో నిలిచింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ తాజాగా 'ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ క్యూ4 2024' నివేదికను విడుదల చేసిన క్రమంలో వెలుగులోకి వచ్చింది. 2024 డిసెంబర్ త్రైమాసికంలో దేశ రాజధానిలో లగ్జరీ హౌసింగ్ సగటున 6.7% ధరల పెరుగుదలను నమోదు చేసింది.
ధరల ట్రాకింగ్..
ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా 44 ప్రధాన నగరాల్లో నివాస ధరల కదలికలను ట్రాక్ చేసింది. ఈ సూచిక స్థానిక కరెన్సీలో నామమాత్రపు ధర మార్పులను కొలుస్తుంది. తాజా ర్యాంకింగ్‌లు న్యూఢిల్లీలో హై ఎండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు ఉన్న బలమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తాయి. ఇది నిరంతర పెట్టుబడిదారుల ఆసక్తి, ఆర్థిక స్థితిస్థాపకత, బలమైన రియల్ ఎస్టేట్ మార్కెట్ వంటి అంశాలను ప్రస్తావిస్తుంది.
గ్లోబల్ సిటీస్ ఇండెక్స్
ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ అనేది ఒక విలువ ఆధారిత సూచిక. ఇది ప్రపంచవ్యాప్తంగా 44 నగరాల్లో ప్రధాన నివాస ధరల కదలికలను ట్రాక్ చేస్తుంది. ఈ సూచిక ద్వారా స్థానిక కరెన్సీలలో ధర మార్పులను పరిశీలిస్తారు. తాజా ర్యాంకుల ప్రకారం చూస్తే న్యూఢిల్లీలో రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు మంచి డిమాండ్ ఉందనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారుల ఆసక్తి, ఆర్థిక స్థితిస్థాపకత, బలమైన రియల్ ఎస్టేట్ మార్కెట్ వంటి అంశాలను సూచిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ ఇళ్ల ధరలు పెరిగిన నగరాలు
సియోల్ – 18.4%
మనీలా – 17.9%
దుబాయ్ – 16.9%
టోక్యో – 12.7%
నైరోబి – 8.3%
న్యూఢిల్లీ – 6.7%
ముంబై – 6.1%
మాడ్రిడ్ – 5.5%
పెర్త్ – 5.3%
లిస్బన్ – 5.3%
సింగపూర్ – 5.0%
బ్రిస్బేన్ – 4.1%
బెంగళూరు – 4.1%
జ్యూరిచ్ – 4.0%
డబ్లిన్ – 3.9%
ధరలు పెరగడానికి కారణాలు
నివేదిక ప్రకారం గత 12 నెలల్లో న్యూఢిల్లీలో లగ్జరీ హౌసింగ్ ధరలు 6.7 శాతం పెరిగాయి. ఈ ధరల పెరుగుదల బలమైన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పుంజుకున్నాయి. జీవనశైలి మారుతున్న క్రమంలో అనేక మంది సంపన్న గృహాలను కొనుగోలుదారులు చేయడం కూడా కారణం. 2023 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఢిల్లీ 16వ స్థానంలో ఉండగా, 2024 డిసెంబర్ త్రైమాసికంలో ఆరో స్థానానికి చేరుకోవడం విశేషం.
ముంబైలో కూడా..
ఇదే సమయంలో ముంబైలో కూడా గణనీయమైన వృద్ధి నమోదైంది. 2024 డిసెంబర్ త్రైమాసికంలో ముంబై ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలు 6.1 శాతం పెరిగాయి. ఇది ర్యాంకింగ్‌లో ఏడో స్థానాన్ని దక్కించుకుంది. బెంగళూరులో కూడా మంచి పెరుగుదల రికార్డైంది. 2023 నాలుగో త్రైమాసికంలో 27వ స్థానంలో ఉన్న బెంగళూరు, 2024 డిసెంబర్ త్రైమాసికంలో 13వ స్థానానికి చేరుకుంది. దీని ధరలు 4.1 శాతం పెరిగాయి.
ఇవి కూడా చదవండి:
Stock Market: 1138 పాయింట్లు పడిపోయిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్ల ఆందోళన..
Kumbh Mela 2025: కుంభమేళా ట్రాఫిక్ అప్‌డేట్స్ ఇలా తెలుసుకోండి.. సులభంగా వెళ్లండి..
Viral News: సోడా సేవించి ముగ్గురు మృతి.. రంగంలోకి పోలీసులు
Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Gold and Silver Rates Today: రెండు వేలకుపైగా పెరిగిన గోల్డ్.. వెండి ధర ఎలా ఉందంటే..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
Read More Business News and Latest Telugu News