New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:53 PM
మీరు నిత్యం ఫాస్టాగ్ చెల్లింపులు చేస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే నేటి (ఫిబ్రవరి 17, 2025) నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

దేశంలో ఫాస్టాగ్ వినియోగదారులకు (New FASTag Rules) కీలక అలర్ట్ వచ్చేసింది. ఈరోజు (ఫిబ్రవరి 17, 2025) నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. వీటి గురించి తెలుసుకోకుంటే మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే ఆ నిబంధనలు ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం. కొత్త రూల్స్ ప్రకారం టోల్ చెల్లింపుల్లో వ్యవధిని తగ్గించడంతోపాటు వాహనాల రవాణా, భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పలు నియమాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించింది. ఈ క్రమంలో FASTagను సమర్థవంతంగా ఉపయోగించడం, సమయానుకూలంగా టోల్ చెల్లింపులు చేసే అవకాశం ఉంది.
మినిమం బ్యాలెన్స్
ఈ కొత్త రూల్స్ ప్రకారం FASTagలో మినిమం రూ. 100 బ్యాలెన్స్ కంటే తక్కువ ఉన్న వినియోగదారులు చెల్లింపు చేయడంలో ఆలస్యం లేదా FASTag బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నవారు అదనపు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఈ మార్పులు టోల్ ప్లాజాలలో వాహనాల క్యూలను తగ్గించేందుకు, ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసేందుకు రూపొందించబడ్డాయి. కాబట్టి మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి.
ఎక్కువ సమయం
దీంతోపాటు వాహనదారుడు టోల్ గేట్ ప్రాంతానికి వచ్చి FASTag 60 నిమిషాలకంటే ఎక్కువ సమయం ఉంటే, టోల్ దాటిన 10 నిమిషాల తర్వాత ఆ లావాదేవీ తిరస్కరించబడుతుంది. అంటే టోల్ చెల్లింపు జరగదని "ఎర్రర్ కోడ్ 176" చూపిస్తుంది. దీంతో టోల్ ప్లాజాలో ఆ చెల్లింపు జరగదు. మీరు చార్జ్ చేసినప్పటికీ, ట్యాగ్ స్కాన్ చేసిన 10 నిమిషాలలోపు ఖాతాను రీఛార్జ్ చేస్తే, మీరు జరిమానాను తిరిగి పొందుతారు. అయితే టోల్ రీడర్ గుండా వాహనం వెళ్ళిన 15 నిమిషాల తర్వాత, చెల్లింపు ప్రాసెస్ చేయబడితే, వినియోగదారులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.
తక్కువ బ్యాలెన్స్, బ్లాక్ లిస్ట్ వంటి కారణాలతో FASTag చెల్లింపు జరగకపోతే, మీకు టోల్ ప్లాజాలో మీ స్థితిని సరిదిద్దుకోవడానికి 70 నిమిషాల సమయం లభిస్తుంది.
బ్లాక్‌లిస్ట్ లేదా తక్కువ బ్యాలెన్స్ ఉన్న FASTags 15 రోజుల వ్యవధి పూర్తైన తర్వాత మాత్రమే ఛార్జ్‌బ్యాక్ చేసుకోవాలి. 15 రోజుల ముందు చేసిన ఛార్జ్‌బ్యాక్ అభ్యర్థనలు తిరస్కరించబడతాయి. ఎర్రర్ కోడ్ 5290 అని వస్తుంది.
బ్లాక్‌లిస్ట్ FASTag ఉన్న వినియోగదారులు బూత్‌కు చేరుకున్న తర్వాత వసూలు చేసిన టోల్‌ను రెట్టింపు చేస్తారు. అయితే, బ్లాక్‌లిస్టింగ్ గురించి తెలిసిన వినియోగదారులు 10 నిమిషాల్లోపు రీఛార్జ్ పొందితే, డబ్బును తిరిగి పొందవచ్చు.
ఈ కొత్త మార్పుల నేపథ్యంలో వినియోగదారులు ఎప్పటికప్పూడూ తమ FASTag ఖాతాను నిరంతరం తనిఖీ చేసుకోవాలి. టోల్ ప్లాజా వద్ద తక్కువ బ్యాలెన్స్, బ్లాక్‌లిస్ట్ పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోవాలి. నిబంధనలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు అదనపు జరిమానాలు, ఇతర ఛార్జీలు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
సందేహాస్పద FASTag టోల్‌ను చేరుకున్న తర్వాత బ్లాక్‌లిస్ట్ చేయబడితే వినియోగదారుల టోల్ చెల్లింపు ప్రాసెస్ చేయబడదు. అదనంగా, స్కానింగ్ సమయానికి కనీసం 10 నిమిషాల ముందు FASTag బ్లాక్‌లిస్ట్ చేయబడితే చెల్లింపు తిరస్కరించబడుతుంది.
ఇవి కూడా చదవండి:
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్
Read More Business News and Latest Telugu News