ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

SBI Cyber Alert: ఆ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లు అస్సలు లిఫ్ట్ చేయకండి.. ఎస్బీఐ అలర్ట్..

ABN, Publish Date - Jun 06 , 2025 | 04:56 PM

దేశంలో డిజిటల్ పేమెంట్స్ పుంజుకున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అపరిచిత ఫోన్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయకూడదని ఎస్బీఐ (SBI Cyber Alert) తెలిపింది. దీంతోపాటు కస్టమర్లకు కీలక సూచనలు జారీ చేసింది.

SBI Cyber Alert

దేశంలో సైబర్ మోసాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు కీలక భద్రతా సూచనలు జారీ చేసింది. ఇవి ప్రజలను సైబర్ మోసాల (SBI Cyber Alert) నుంచి రక్షించడంతో పాటు, నిజమైన బ్యాంక్ కమ్యూనికేషన్లను గుర్తించేందుకు సహాయపడతాయి. ఈ నేపథ్యంలో SBI తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక ముఖ్యమైన పోస్ట్‌ చేసి పలు నంబర్ల గురించి ప్రస్తావించింది.


వాటిలో మీరు +91 1600తో ప్రారంభమయ్యే నంబర్ నుంచి కాల్ స్వీకరిస్తే అది నిజమైన, చట్టబద్ధమైన కాల్ అని నమ్మాలని ఎస్బీఐ తెలిపింది. ఈ నంబర్లను కస్టమర్లు లావాదేవీలు, సేవలకు సంబంధించిన కాల్స్ కోసం మాత్రమే ఉపయోగించబడతాయని వెల్లడించింది. ఇవి కాకుండా ఇతర నంబర్ల నుంచి వచ్చే స్పామ్ లేదా మోసపూరిత కాల్స్ విషయంలో జాగ్రత్త వహించాలని సూచించింది.


ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అన్ని బ్యాంకులకు, నియంత్రిత సంస్థలకు (Regulated Entities) ఒక నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం బ్యాంకులు, ఇతర సేవా సంస్థలు కేవలం +91 1600 సీరిస్ నంబర్లను మాత్రమే వినియోగదారులకి ట్రాన్సాక్షన్ లేదా సేవల కోసం ఫోన్ చేయడానికి ఉపయోగించాలని తెలిపింది. ఇది వినియోగదారులను ఫ్రాడ్, స్కామ్ కాల్స్ నుంచి రక్షించేందుకు సహాయపడుతుంది.


వినియోగదారులకు ముఖ్యమైన సూచనలు

  • SBI సైబర్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో వినియోగదారులు వీటిపై అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం

  • వినియోగదారులు SBI అధికారిక నంబర్లను మాత్రమే గుర్తించాలి

  • అసాధారణ నంబర్ల నుంచి వచ్చిన కాల్స్‌ విషయంలో జాగ్రత్త వహించాలి

  • ప్రతిసారీ వస్తున్న అపరిచిత కాల్స్‌పై డౌట్ ఉంటే, SBI అధికారిక ఛానెల్స్ ద్వారా వాస్తవికతను నిర్ధారించుకోవాలి

  • మీకు అసందర్భ కాల్స్, SMS, లేదా లింకులు ఏమైనా వచ్చినప్పుడు వాటిపై తక్షణమే స్పందించి వాటికి దూరంగా ఉండాలి

SBI అధికారిక నంబర్లు:

  • 1600-01-8000

  • 1600-01-8003

  • 1600-01-8006

  • 1600-11-7012

  • 1600-11-7015

  • 1600-01-8001

  • 1600-01-8004

  • 1600-01-8007

  • 1600-11-7013

  • 1600-00-1351

  • 1600-01-8002

  • 1600-01-8005

  • 1600-11-7011

  • 1600-01-7014

  • 1600-10-0021

ఇవి మాత్రమే నిజమైన SBI కాల్స్‌కు సంబంధించినవి. మరే ఇతర నంబర్ల నుంచి వస్తున్న ఫోన్లపై వినియోగదారులు జాగ్రత్త వహించాలి.


ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 06 , 2025 | 05:08 PM