ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jio: కేవలం రూ.100కే రూ.299 విలువైన ప్రయోజనాలు.. ఈ ఛాన్స్ మిస్సవద్దు..

ABN, Publish Date - May 16 , 2025 | 06:39 PM

జియో యూజర్ల కోసం క్రేజీ ఆఫర్ వచ్చేసింది. ఈ క్రమంలో రూ. 100 ప్లాన్ సాధారణంగా రూ. 299 ప్లాన్‌లో అందుబాటులో ఉండే ప్రీమియం OTT సేవలను అందించడం విశేషం. ఈ ప్లాన్ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Jio Rs 100 plan Benefits

భారతదేశంలో ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో అద్భుతమైన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ద్వారా రూ. 299 విలువైన OTT ప్రయోజనాలు కేవలం రూ. 100కే లభిస్తుండటం విశేషం. మొబైల్ లేదా టీవీలో స్ట్రీమింగ్ కంటెంట్‌ను ఆస్వాదించే వినియోగదారుల కోసం ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. గతంలో జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందడానికి కనీసం రూ. 299 ప్లాన్ అవసరం. ఈ సబ్‌స్క్రిప్షన్ ద్వారా వినియోగదారులు మొబైల్, టీవీ రెండింటిలోనూ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్‌ను ఆస్వాదించవచ్చు.


90 రోజుల వరకు

కానీ ఇప్పుడు, జియో ఈ ప్రీమియం సేవను రూ. 100 ప్లాన్‌కు తగ్గించింది. ఈ సబ్‌స్క్రిప్షన్ 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ క్రమంలో మొత్తం 5జీబీ డేటా లభిస్తుంది. దీంతో వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రెండు ప్లాట్‌ఫారమ్‌లలోనూ కంటెంట్‌ను వీక్షించవచ్చు. జియో సినిమా ప్రీమియం ద్వారా హాలీవుడ్, బాలీవుడ్, రీజనల్ సినిమాలు, ఒరిజినల్ సిరీస్‌లు, క్రీడా ఈవెంట్‌ల వంటి కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ఆఫర్ ద్వారా, జియో వినియోగదారులు ఇష్టమైన షోలను ఎక్కడైనా, ఎప్పుడైనా వీక్షించవచ్చు.


ముఖ్యమైన షరతులు

  • రూ. 100 ప్లాన్ అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, వినియోగదారులు కొన్ని ముఖ్యమైన షరతులను గమనించాలి

  • యాక్టివ్ బేస్ ప్లాన్ అవసరం: ఈ ఆఫర్‌ను ఉపయోగించడానికి, మీ జియో నంబర్‌పై ఒక యాక్టివ్ బేస్ ప్లాన్ ఉండాలి. ఈ రూ. 100 ప్లాన్ స్వతంత్రంగా మీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచదు.

  • బూస్టర్/సెకండరీ ప్లాన్: ఈ ప్లాన్ ప్రధానంగా OTT యాక్సెస్, పరిమిత డేటా కోసం రూపొందించబడింది. కాబట్టి ఇది స్టాండ్ ఎలోన్ ప్లాన్ కాదు

  • ఈ షరతులు ప్లాన్ వినియోగాన్ని కొంతవరకు పరిమితం చేసినప్పటికీ, ఇప్పటికే యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న వినియోగదారులకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు

స్ట్రీమింగ్ ప్రియులకు మంచి ఛాయిస్

మీరు జియో వినియోగదారు అయి, వెబ్ సిరీస్‌లను వాచ్ చేయడం లేదా లేటెస్ట్ సినిమాలను చూడటం ఇష్టపడితే ఈ రూ. 100 ప్లాన్ మీకు ఒక అద్భుతమైన డీల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 90 రోజుల జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, ఇంకా 5GB డేటాతో ఈ ప్లాన్ తక్కువ ధరల్లో లభించడం విశేషం.


ఇవి కూడా చదవండి

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుని ఆర్నేళ్లు కట్టకపోతే జైలుకు పంపిస్తారా..రూల్స్ ఏం చెబుతున్నాయ్


Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..


NRI Money Transfer Tax: ఎన్నారైలకు షాకింగ్ న్యూస్.. విదేశాలకు మనీ పంపిస్తే బాదుడేనా..


Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 16 , 2025 | 06:40 PM