ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Income Tax Return 2025: ఆదాయం పన్ను పరిమితికి లోబడి ఉన్నా

ABN, Publish Date - Aug 17 , 2025 | 02:57 AM

ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల ఫైలింగ్‌ గడువు దగ్గర పడుతోంది. ఏటా జూలై ఆఖరు వరకు ఉండే గడువును ఈ సంవత్సరం ప్రభుత్వం సెప్టెంబరు 15 వరకు పొడిగించింది. చాలా మంది మన...

రిటర్నులు దాఖలు చేయాల్సిందే...

ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల ఫైలింగ్‌ గడువు దగ్గర పడుతోంది. ఏటా జూలై ఆఖరు వరకు ఉండే గడువును ఈ సంవత్సరం ప్రభుత్వం సెప్టెంబరు 15 వరకు పొడిగించింది. చాలా మంది మన ఆదాయం పన్ను పరిమితికి లోబడే ఉంది కదా.. రిటర్న్‌ ఫైల్‌ చేయాల్సిన అవసరం ఏముందని అనుకుంటారు. అయితే ఆదాయం, పన్ను మినహాయింపు పరిధికి లోబడి ఉన్నా.. ఈ కింది సందర్భాల్లో రిటర్న్‌ ఫైల్‌ చేయక తప్పదు. అవేమిటంటే..

విదేశీ ప్రయాణ ఖర్చులు: ఆదాయం తక్కువగా ఉన్నా చాలా మంది విదేశీ పర్యటనల్లో జోరుగా ఖర్చు చేస్తుంటారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ ఖర్చులు రూ.2 లక్షలు లేదా అంతకు మించి ఉంటే వారి ఆదాయం పన్ను మినహాయింపు పరిమితికి లోబడి ఉన్నా వారు తప్పనిసరిగా ఐటీ రిటర్న్‌ దాఖలు చేయాలి.

విదేశీ ఆస్తులు: ప్రపంచీకరణ పుణ్యమానీ భారతీయులూ పెద్దఎత్తున విదేశాల్లో ఆస్తులు కూడబెడుతున్నారు లేదా విదేశీ కంపెనీల షేర్లు, రుణ పత్రాల్లో మదుపు చేసి వాటిపై వచ్చే డివిడెండ్‌, వడ్డీ ఆదాయం పొందుతున్నారు. ఇలాంటి వ్యక్తుల ఆదాయం మన దేశంలో పన్ను మినహాయింపు పరిమితికి లోబడి ఉన్నా.. తప్పనిసరిగా తమ విదేశీ ఆస్తులు, పెట్టుబడులు, ఆదాయ వివరాలతో ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయాలి.

టీడీఎస్‌, టీసీఎస్‌: గత ఆర్థిక సంవత్సరం (2024-25) లో మీ ఆదాయం నుంచి టీడీఎస్‌ లేదా టీసీఎస్‌ రూ.25,000 లేదా అంతకు మించి ఉన్నా ఐటీ రిటర్న్‌ చేయడం తప్పనిసరి.

వ్యాపార టర్నోవర్‌, రాబడి: ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి వ్యాపార అమ్మకాలు, టర్నోవర్‌, ఆదాయం రూ.60 లక్షలు మించితే..ఆ వ్యక్తి తప్పనిసరిగా రిటర్న్‌ ఫైల్‌ చేయాలి. అదే వృత్తి నిపుణులైతే వార్షిక ఆదాయం రూ.10 లక్షలు మించితే తప్పనిసరిగా రిటర్న్‌ దాఖలు చేయాలి.

కరెంట్‌ బిల్లు: కరెంట్‌ బిల్లు కూడా మీరు ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. ఆర్థిక సంవత్సరంలో మీ వార్షిక కరెంటు బిల్లు రూ.2 లక్షలు లేదా అంతకు మించి ఉంటే తప్పనిసరిగా ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయాలి.

ఐటీ రిఫండ్‌: మీ వార్షిక ఆదాయం పన్ను మినహాయింపు పరిమితికి లోబడి ఉన్నా, ట్యాక్స్‌ రిఫండ్‌ ఏమైనా ఉంటే, ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయడం తప్పనిసరి. ఈ రిటర్న్‌లోని సమాచారాన్ని సరిచూసుకునే ఆదాయ పన్ను శాఖ రిఫండ్‌ జారీ చేస్తుంది.

డిపాజిట్లు: ఏ వ్యక్తికైనా ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు కరెంట్‌ ఖాతాలో అయితే రూ.కోటి లేదా అంతకు మించి, సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలో అయితే రూ.50 లక్షలు లేదా అంతకు మించి డిపాజిట్లు ఉంటే.. వారు తప్పనిసరిగా ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయాలి.

ఎల్‌టీసీజీ మినహాయింపు కోరితే: వార్షిక ఆదాయం పన్ను మినహాయింపు పరిమితికి లోబడి ఉన్నా పెట్టుబడి లాభాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) మినహాయింపు కోరుకునే వ్యక్తులూ తప్పనిసరిగా ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయాలి.

Also Read:

30 ఏళ్లుగా ఏపీలో ఉగ్రవాదులు..

సిద్ధార్థ్ రెడ్డిపై అఖిల ప్రియ సెటైర్లు..

వైఎస్ భారతిపై మాజీ మంత్రి సుజాత కీలక వ్యాఖ్యలు..

For More Business News and Telugu News..

Updated Date - Aug 17 , 2025 | 02:57 AM