AP Politics: రియల్ లైఫ్‌కి రా నాయనా.. సిద్ధార్థ్ రెడ్డికి అఖిల ప్రియ కౌంటర్..
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:53 PM
వైఎస్ జగన్, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఓటమితో జగన్ మైండ్ బ్లాంక్ అయినట్లుందని సెటైర్లు వేశారు. శనివారం నాడు కర్నూలులోని మహిళా జైలును సందర్శించారు భూమా అఖిల ప్రియ..
కర్నూలు, ఆగస్టు 16: వైఎస్ జగన్, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఓటమితో జగన్ మైండ్ బ్లాంక్ అయినట్లుందని సెటైర్లు వేశారు. శనివారం నాడు కర్నూలులోని మహిళా జైలును సందర్శించారు భూమా అఖిల ప్రియ. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని చాలా మంది అనుకుంటున్నారని అన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలతో అక్కడి ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. ఇవే చివరి ఎన్నికలు అని జగన్ భయపడుతున్నారేమో అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు పాలనను ఎవరు అడ్డుకోలేరన్నారు. వందేళ్ల వరకు ప్రజలు బాగా ఉండాలని చంద్రబాబు నిత్యం కష్టపడుతున్నారని అఖిల ప్రియ చెప్పుకొచ్చారు. చంద్రబాబును విమర్శించే ముందు వైసీపీలో నాయకులు ఉంటారో లేదో జగన్ తెలుసుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పక్కా ఆధారాలతోనే లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్‌లు జరుగుతున్నాయని చెప్పారు. అర్ధరాత్రి గోడలు దూకి ఎవరిని అరెస్టు చేయడం లేదన్నారు.
సిద్ధార్థ్ రెడ్డిపై సెటైర్లు..
ఇదే సమయంలో వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై అఖిల ప్రియ సెటైర్లు వేశారు. ఆయన చేసిన కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చారు. ‘బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాటకారి. నా యాసతో యూత్ అట్రాక్ట్ అవుతారు. ఫాలోవర్స్, లైకులు, షేర్స్ ఉంటే చాలు అనుకుంటున్నాడు. రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ లోకి వచ్చి రాజకీయాలు తెలుసుకోవాలి. రీల్ లైఫ్ రాజకీయాలు వేరు. ఫీల్డ్ లో ఉండి చేసే రాజకీయాలు వేరు.’ అంటూ సెటైర్లు వేశారు. బైరెడ్డి సిద్ధా్ర్థ్ రెడ్డికి రాజకీయాలు తెలియవని.. తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని అఖిల ప్రియ హితవు చెప్పారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రాని విషయాన్ని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తెలుసుకోవాలంటూ చురకలంటించారు.
Also Read:
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ వేటు..?
అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ యూపీఐ ఫీచర్ కనిపించదు
పద్మశ్రీ బులా చౌదరి గోల్డ్‌మెడల్స్ చోరీ
For More Andhra Pradesh News and Telugu News..