PCC Mahesh Kumar Goud: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై వేటు తప్పదా..?
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:24 PM
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడారు..? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తెలుసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.
హైదరాబాద్: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. రాజగోపాల్ వ్యాఖ్యలను పరిశీలించామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. ఆయన గురించి క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడారు..? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తెలుసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.
తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై గతంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) తీవ్ర స్థాయిలో విమర్శలకు పాల్పడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ తన భాష మార్చుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని సూచించారు. మరో మూడున్నరేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అని, ఆ తర్వాత ఎవరన్నది అప్పుడు చూడొచ్చునన్నారు. అందరం కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్‌లోకి వచ్చా అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో జూనియర్లకు మంత్రిపదవి ఇచ్చి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని తెలిపారు. ఇకపై తాను ఎంత దూరమైనా వెళ్తానని తేల్చి చెప్పారు. మనసు చంపుకుని బతకడం తన వల్ల కాదన్నారు. ప్రజల కోసం మరోసారి పదవీ త్యాగానికైనా రెడీ అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంత దుమారం రేపడంతో.. కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. ఈ మేరకు ఆయన వ్యాఖ్యలు పీసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కనకగిరి అడవుల్లో నీలిరంగు పుట్టగొడుగు