Home » Rajagopal Reddy
రెడ్డి సామాజిక వర్గాన్ని, తనను కించపరుస్తూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేశారంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్లకు నీతి, జాతి లేదని మల్లన్న తప్పుగా మాట్లాడుతున్నారని, ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి తనపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
కాంగ్రెస్ బలోపేతానికి ఇతర పార్టీల నాయకులను ఆహ్వానించామని, కానీ తమ ఇంటికే వచ్చి తమనే గెంటేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. తనలో అణువణువు కాంగ్రెస్ రక్తమే ఉందని, తాను ఉన్నంత వరకూ కాంగ్రెస్‌ను ఎవరూ కబ్జా చేయలేరని స్పష్టం చేశారు
తుంగతుర్తిలో తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించానంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి చేసి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మందుల సామెల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు కుర్చీ కొట్లాట కొనసాగుతోంది. ఈ క్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా మోగదాల పావని రమేష్ గౌడ్‌ను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ అనుచరులు ఆందోళన చేపట్టారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశం మీద టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నదమ్ములిద్దరూ ముక్కుసూటిగా మాట్లాడుతారన్నారు. మంత్రి పదవుల విషయంలో జిల్లాను యూనిట్‌గా చూడలేమని..
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడారు..? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తెలుసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.
తనకు మంత్రి పదవి రాకున్నా పర్వాలేదని, తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులిస్తే చాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.
తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రాజగోపాల్ రెడ్డి 'ఎక్స్' వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
భగవంతుడి ఆశీస్సులతో మంత్రినవుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కాస్త ఆలస్యమైనందుకు క్షమించాలని కోరారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అసెంబ్లీలో లేకపోవడం వల్ల తమకు కిక్కు రావడం లేదని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. శుక్రవారం నాడు మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు.