‘నా టికెట్ రాజ్‌గోపాల్ ఇవ్వలేదు’.. ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 25 , 2026 | 01:35 PM
తుంగతుర్తిలో తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించానంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి చేసి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మందుల సామెల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, జులై 25: తుంగతుర్తిలో తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించానంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి చేసి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మందుల సామెల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌గోపాల్.. పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వచ్చారని.. ఆయన కంటే ముందు తానే కాంగ్రెస్‌లోకి వచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చేది అధిష్ఠానం మాత్రమే అని చెప్పుకొచ్చారు.
‘నాకు రెడ్లు ఓటేశారు, రాజ్‌గోపాల్ రెడ్డికి మాదిగలు ఓటేశారు. రెడ్లు, దళితులతోనే రాజ్యం నడవదు. నాకు టిక్కెట్ ఇచ్చింది ఏఐసీసీ. రాజగోపాల్ రెడ్డి కాదు. నా నియోజకవర్గానికి వచ్చి రోడ్డును పరిశీలించిని కోమటిరెడ్డి.. నాతో ఒక్కమాట కూడా చెప్పలేదు. మునుగోడులో నా క్యాడర్ కూడా ఉంది. మునుగోడులో రాజ్‌గోపాల్‌ను గెలిపించినందుకు నా క్యాడర్ బాధపడుతోంది’ అని ఎమ్మెల్యే మందుల సామెల్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
హోం మంత్రి అనిత ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్.. అధికారుల అలర్ట్
జగిత్యాల జిల్లాలో విషజ్వరాల కలకలం.. ఇద్దరు చిన్నారుల మృతి
Read Latest Telangana News And Telugu News