Share News

జగిత్యాల జిల్లాలో విషజ్వరాల కలకలం.. ఇద్దరు చిన్నారుల మృతి

ABN , Publish Date - Jul 25 , 2026 | 09:53 AM

జగిత్యాల జిల్లాలోని పొరండ్ల గ్రామంలో విషజ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామంలో విషజ్వరాల బారిన పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది.

జగిత్యాల జిల్లాలో విషజ్వరాల కలకలం.. ఇద్దరు చిన్నారుల మృతి
Jagitial viral fever

జగిత్యాల, జులై 25: జిల్లాలోని పొరండ్ల గ్రామంలో విషజ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామంలో విషజ్వరాల బారిన పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. విషజ్వరంతో బాధపడుతున్న హరిస్మిత(6) అనే చిన్నారి.. చికిత్స పొందుతూ మృతి చెందింది. నిన్న(శుక్రవారం) వరుణ్ తేజ(6) అనే చిన్నారి కూడా విషజ్వరం బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. వైరల్ ఫీవర్ కారణంగానే చిన్నారులు మరణించినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.


ఇద్దరు చిన్నారుల మృతిలో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పొరండ్ల గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. జిల్లాలో పరిస్థితిపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

పుష్పక విమానం కాదు నాయనా..!

హోం మంత్రి అనిత ‘ఎక్స్‌’ అకౌంట్ హ్యాక్.. అధికారుల అలర్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 25 , 2026 | 09:58 AM