Share News

సబ్‌స్టేషన్లలో సోలార్‌ ప్లాంట్లు

ABN , Publish Date - Jul 25 , 2026 | 08:29 AM

విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలో సోలార్‌ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

సబ్‌స్టేషన్లలో సోలార్‌ ప్లాంట్లు
Solar plants, TGSPDCL

  • 4 జిల్లాల్లోని 8 సర్కిళ్లలో కిలోవాట్‌ చొప్పున..

  • దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ప్రణాళికలు

  • భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని..

హైదరాబాద్‌ సిటీ: విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలో సోలార్‌ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దక్షిణ డిస్కంకు రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో 33/11 కేవీ సబ్‌ స్టేషన్లు 1,733 ఉన్నాయి. వాటిలో అత్యధిక సబ్‌స్టేషన్లు 5 నుంచి 6 ఎకరాల విసీర్ణంలో ఉన్నాయి. ఆయా సబ్‌స్టేషన్ల చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల్లో 1 నుంచి 1.5 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని డిస్కం భావిస్తోంది.


మొదటగా మహబూబ్‌నగర్‌, నల్గొండ, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లోని 8 సర్కిళ్లలోని మహబూబ్‌నగర్‌, నారాయణపేట, యాదాద్రి, సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, రాజేంద్రనగర్‌, వికారాబాద్‌ సర్కిళ్లలో కిలో వాట్‌ సామర్థ్యంలో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.


city3.4.jpgకమర్షియల్‌ ఆదాయంపై దృష్టి

విద్యుత్‌ సబ్‌స్టేషన్లతో పాటు సర్కిల్‌, డివిజన్‌ కార్యాలయాల వరణలో ఉన్న ఖాళీస్థలాలను వినియోగించుకుంటూ కమర్షియల్‌ ఆదాయం పెంచుకునే దిశగా డిస్కం చర్యలు తీసుకుంటోంది. తాండూరు, వికారాబాద్‌ వంటి ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను 15 నుంచి 20 ఏళ్లకు లీజుకు ఇస్తే భారీగా ఆదాయం వచ్చే అవకాశాలుంటాయని సీనియర్‌ రిటైర్డ్‌ ఇంజనీర్లు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణపై కేంద్రానికి లేఖ

లాభం ఆశ చూపి.. రూ.16.35 లక్షలు కొట్టేశారు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 25 , 2026 | 08:29 AM