నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి..
ABN , Publish Date - Jul 25 , 2026 | 07:23 AM
నల్ల సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఒక భారతీయ నావికుడు మరణించాడు. ఆ నౌకలో మొత్తం పది మంది సిబ్బంది ఉండగా, వారిలో ముగ్గురు భారతీయులు.
నల్ల సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఒక భారతీయ నావికుడు మరణించాడు. ఆ నౌకలో మొత్తం పది మంది సిబ్బంది ఉండగా, వారిలో ముగ్గురు భారతీయులు. దాడి కారణంగా ఒక భారతీయుడు మరణించగా, మరో ఇద్దరు సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది (Black Sea attack).
విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఈ ఘటనను అధికారికంగా ధ్రువీకరిస్తూ, వాణిజ్య నౌకలపై దాడులు చేయడం సరి కాదని స్పష్టం చేసింది. జూలై 18న రష్యా ప్రాదేశిక జలాలుగా పేర్కొంటున్న ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఎంవీ ఓమోర్ఫీ నౌకపై దాడి జరిగినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ దాడిలో ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది (Indian seafarer death).
అంతర్జాతీయ వాణిజ్య నౌకల భద్రతను కాపాడటం అన్ని దేశాల బాధ్యత అని, సముద్ర రవాణా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలు ప్రపంచ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది (Black Sea news). మృతుడి కుటుంబానికి అవసరమైన అన్ని సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. అలాగే నౌక యాజమాన్యం, సంబంధిత దేశాల అధికారులతో భారత ప్రభుత్వం నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన
అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు