Share News

అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు

ABN , Publish Date - Jul 24 , 2026 | 05:51 PM

రాజధాని అమరావతిలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఎన్‌జీఓ) టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు పడింది. నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ తుది దశ నిర్మాణ పనుల కోసం రూ. 83.99 కోట్ల విలువైన కాంట్రాక్టును ఎల్ అండ్ టీ సంస్థకు అమరావతి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ గ్రీన్‌ఫీల్డ్ సిటీస్ లిమిటెడ్ (AGICL) అందజేసింది.

అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు

అమరావతి, జులై 24: రాజధాని అమరావతిలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఎన్‌జీఓ) టవర్స్ నిర్మాణ పనుల విషయంలో మరో ముందడుగు పడింది. నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ తుది దశ నిర్మాణ పనుల కోసం రూ. 83.99 కోట్ల విలువైన కాంట్రాక్టును ఎల్ అండ్ టీ సంస్థకు అమరావతి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ గ్రీన్‌ఫీల్డ్ సిటీస్ లిమిటెడ్ (AGICL) అందజేసింది.

శుక్రవారం రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఎల్ అండ్ టీ సంస్థకు ఎల్ఓఏను AGICL ఎండీ అభిషేక్ కుమార్ అందజేశారు. టెండర్ ప్రక్రియలో ఎల్ 1 బిడ్డర్‌గా నిలిచిన ఎల్ అండ్ టీకి ఈ పనులను అప్పగించారు.


ఈ ఒప్పందం ప్రకారం ఎన్‌జీఓ టవర్స్‌లో మిగిలిన తుది దశ పనులను ఈ సంస్థ పూర్తి చేయనుంది. ముఖ్యంగా భవనాల అంతర్గత పనులతోపాటు ఫినిషింగ్ పనులు, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, కాంపౌండ్ వాల్స్, అంతర్గత మౌలిక వసతులతోపాటు ఇతర అనుబంధ పనుల నిర్మాణం చేపట్టనుంది.


మరో వైపు రాజధాని అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌తోపాటు వివిధ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ నిర్మాణ పనుల వేగం ఊపందుకుంది. ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Updated Date - Jul 24 , 2026 | 06:28 PM