స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన
ABN , Publish Date - Jul 24 , 2026 | 04:18 PM
క్షేత్రస్థాయిలో నాయకత్వం ఏ విధంగా ఉంది.. స్థానికంగా ఉన్న సమస్యలు ఏమిటనేది తెలుసుకోవాలని జనసేన పార్టీ నేతలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. వాటిని పరిష్కరించ కలిగితే.. రేపటి రోజున స్థానిక సంస్థలలో ధైర్యంగా మన నాయకత్వం వెళ్లగలుగుతుందని అన్నారు.
విజయవాడ, జులై 24: క్షేత్రస్థాయిలో నాయకత్వం ఏ విధంగా ఉంది.. స్థానికంగా ఉన్న సమస్యలు ఏమిటనేది తెలుసుకోవాలని జనసేన పార్టీ నేతలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. వాటిని పరిష్కరించ కలిగితే.. రేపటి రోజున స్థానిక సంస్థలలో ధైర్యంగా మన నాయకత్వం వెళ్లగలుగుతుందని అన్నారు. ఆ సమస్యలు బయటికి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో జనసేన పార్టీ కేడర్‌తో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ.. 2021లో భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండి.. విజయవాడ నగరంలో 39 డివిజన్లలో జనసేన పార్టీ పోటీ చేసిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం.. దుష్టశక్తులను ఎదుర్కొని.. వాళ్లు చేసిన అరాచకాలను తట్టుకొని ప్రచారం చేశామని వివరించారు. నాయకత్వం బలోపేతం అవడమే కాకుండా.. పార్టీ సంస్థాగతంగా ఎదగాలని పేర్కొన్నారు. అందుకోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాలు ప్రతీ చోట నిర్వహిస్తున్నారని చెప్పారు.
ఇంత పారదర్శకంగా జరిగే ఈ కార్యక్రమంలో ఈ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని వారి అభిప్రాయాలను ఫామ్స్‌లో తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఎవరైతే పార్టీ కోసం నిలకడగా గతంలో నిలబడ్డారో, వాళ్లందరికీ ఆ గౌరవంతోపాటు అవకాశం కూడా పవన్ కళ్యాణ్ కల్పిస్తారని తెలిపారు. సమస్య ఏదైనా ఉంటే మాట్లాడుకునే అవకాశం వాళ్లకు కల్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
పార్టీలో అటువంటి వేదికలను జనసేన పార్టీ అధినేత ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారని వివరించారు. వివిధ నియోజకవర్గాల్లోనూ, జిల్లాల్లోనూ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని, కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా పని చేస్తారని చెప్పారు. పార్టీ కమిటీల గురించి చాలా లోతైన కసరత్తును ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి చేశారని పేర్కొన్నారు. త్వరలోనే ఆయన పూర్తిస్థాయిలో వర్క్‌లోకి దిగగానే కమిటీల ఏర్పాటుపై దృష్టి సారిస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మిగనూరులో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 50 కుటుంబాలు
సీజేపీకి మద్దతుగా ఆందోళన.. ఇలా కూడా చేస్తారా? వీడియో వైరల్
Read Latest AP News And Telugu News