Share News

ఎమ్మిగనూరులో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 50 కుటుంబాలు

ABN , Publish Date - Jul 24 , 2026 | 02:55 PM

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సుమారు 50 కుటుంబాలు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. స్థానిక ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి సమక్షంలో నాయకులు, కార్యకర్తలు పసుపు కండువా కప్పుకుని టీడీపీలో చేరారు.

ఎమ్మిగనూరులో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 50 కుటుంబాలు
yemmiganur

కర్నూలు, జులై 24: ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సుమారు 50 కుటుంబాలు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. స్థానిక ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి సమక్షంలో నాయకులు, కార్యకర్తలు పసుపు కండువా కప్పుకుని టీడీపీలో చేరారు. నియోజకవర్గంలోని నాగులాదిన్నే, బోడబండ, గార్లదిన్నే, వేముగోడు గ్రామాలకు చెందిన ప్రజలు భారీగా టీడీపీలో చేరడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.


కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితోపాటు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు వీరంతా ఆకర్షితులయ్యారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరారని తెలిపారు. పార్టీలో చేరిన వారికి సముచిత గుర్తింపుతోపాటు అవకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.


ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై టీడీపీలో చేరామని వారు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే నాయకత్వంలో కలిసి పని చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో మరింత మంది టీడీపీలో చేరే అవకాశం ఉందని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు. మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. పార్టీలో చేరికల వల్ల ఆ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని కేడర్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మా ప్రభుత్వంలో విద్యావ్యవస్థలో పెను మార్పులు తెచ్చాం: పెమ్మసాని

రాష్ట్రాలను నమ్మండి.. నీట్‌ను రద్దు చేయండి: స్టాలిన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 24 , 2026 | 03:06 PM