Share News

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 11.30 నుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Jul 25 , 2026 | 07:13 AM

హైదరాబాద్‏లోని ఆస్మాన్‌ఘడ్‌ డివిజన్‌ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా శనివారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ విష్ణువర్ధన్‌ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 11.30 నుంచి కరెంట్ కట్
Hyderabad Power Cut Today

సైదాబాద్‌(హైదరాబాద్‏): టీజీఎస్పీడీసీఎల్‌ ఆస్మాన్‌ఘడ్‌ డివిజన్‌ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా శనివారం 11 కేవీ నూర్‌ఖాన్‌ బజార్‌ ఫీడర్‌ పరిధిలో ఉన్న పరిసర ప్రాంతాలలో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ విష్ణువర్ధన్‌ రెడ్డి తెలిపారు. రోషన్‌ డైయిరీ ఫామ్‌ ఫీడర్‌ పరిధిలోని పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు నందనవనం సబ్‌స్టేషన్‌ పరిధిలో కరెంట్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు.


చంపాపేట: హస్తినాపురం డివిజన్‌ నందనవనం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని మీర్‌పేట విద్యుత్‌ సెక్షన్‌లో 33కేవీ లైన్‌లో 11కేవీ వాంబేకాలనీ ఫీడర్‌లో వివిధ మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లలితానగర్‌, రాఘవేంద్రనగర్‌, వాంబేకాలనీ, వెంకటగిరి కాలనీ, వీరమణి కాలనీలలో విద్యుత్‌ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ బాల్‌రాజ్‌ తెలిపారు.


city2.jpgనేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

చిక్కడపల్లి: ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో విద్యుత్‌ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీఏడీఈ నరేంద్రరాజు తెలిపారు. రామాలయం 11 కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో ఉదయం 11 నుంచి 11.30 గంట వరకు, ఆజామాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ పరిధిలో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తామన్నారు.


రాయదుర్గం: గచ్చిబౌలి డివిజన్‌ పరిధిలో విద్యుత్‌ లైన్‌ల మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ శివకృష్ణ ప్రసాద్‌ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌, జయభేరి ఫైన్‌ వ్యాలీ, కేర్‌ హాస్పిటల్‌, మీనాక్షి, ఖాజాగూడ ప్రాంతాలలో విద్యుత్‌ ఉండదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణపై కేంద్రానికి లేఖ

శాఖలన్నీ హైడ్రాకు మోకరిల్లాయి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 25 , 2026 | 07:13 AM