హోం మంత్రి అనిత ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్.. అధికారుల అలర్ట్
ABN , Publish Date - Jul 25 , 2026 | 09:35 AM
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత 'X' అకౌంట్ హ్యాక్ అయ్యింది. దీంతో హోం మంత్రి కార్యాలయ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అకౌంట్ సైబర్ దాడికి గురైన నేపథ్యంలో పోస్ట్ చేసిన అంశాలను అధికారికంగా పరిగణించవద్దని హోం మంత్రి కార్యాలయం ప్రకటించింది.
అమరావతి, జులై 25: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత 'X' అకౌంట్ హ్యాక్ అయ్యింది. దీంతో హోం మంత్రి కార్యాలయ అధికారులు అలర్ట్ జారీ చేశారు. హోం మంత్రి అనిత వ్యక్తిగత 'X' (X - @Anitha_TDP) అకౌంట్‌ను కొందరు హ్యాక్ అయ్యిందని.. ఈ సమయంలో ఆ అకౌంట్ నుంచి అనధికారిక పోస్టులు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అకౌంట్ సైబర్ దాడికి గురైన నేపథ్యంలో పోస్ట్ చేసిన అంశాలను అధికారికంగా పరిగణించవద్దని హోం మంత్రి కార్యాలయం ప్రకటించింది.
ప్రస్తుతం వస్తున్న పోస్టులను అధికారిక సందేశాలుగా పరిగణించవద్దని ప్రజలు, మీడియా, ఫాలోవర్లకు విజ్ఞప్తి చేసింది. అకౌంట్ హ్యాక్ అవ్వడంపై ఇప్పటికే పోలీసులకు హోం మంత్రి ఫిర్యాదు చేశారు. దీంతో హ్యాక్ చేసిన వారిని గుర్తించేందుకు, అకౌంట్ రికవరీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
అమెరికా బెదిరింపులకు లొంగేది లేదు.. SCO సమ్మిట్‌లో ఇరాన్ ప్రకటన
Read Latest AP News And Telugu News