Share News

Rajagopal Reddy : రాజగోపాల్‌రెడ్డిపై టీపీసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 05 , 2025 | 05:10 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశం మీద టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నదమ్ములిద్దరూ ముక్కుసూటిగా మాట్లాడుతారన్నారు. మంత్రి పదవుల విషయంలో జిల్లాను యూనిట్‌గా చూడలేమని..

Rajagopal Reddy : రాజగోపాల్‌రెడ్డిపై  టీపీసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
MLA Rajagopal Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 5 : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. స్వంత పార్టీ ఎమ్మెల్యే అయి ఉండీకూడా ఏకంగా ముఖ్యమంత్రి మీదే వ్యాఖ్యలు చేశారాయన. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ తనకు మంత్రి పదవి ఇవ్వడం లేదని మండిపడ్డారు. అయితే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందనేది అందర్నీ ఆకర్షించింది.


తాజాగా రాజగోపాల్ రెడ్డి అంశం మీద టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నదమ్ములిద్దరూ(కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి) ముక్కుసూటిగా మాట్లాడుతారని చెప్పుకొచ్చారు. రాజగోపాల్‌రెడ్డి అంశాన్ని AICC పరిశీలిస్తోందని చెప్పారు. మంత్రి పదవుల విషయంలో జిల్లాను యూనిట్‌గా చూడలేమని, రాష్ట్రాన్ని యూనిట్‌గా చూస్తారని టీపీసీసీ చీఫ్‌ స్పష్టతనిచ్చారు. ఇక రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై అధిష్టానం ఎలాంటి చర్య తీసుకుంటుందనేది తేలాలంటే, మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 05 , 2025 | 05:30 PM