మేయర్ సీటు ఇస్తామని మోసం చేస్తారా..! కౌన్సిలర్ ఆవేదన

ABN, Publish Date - Feb 16 , 2026 | 01:14 PM

మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు కుర్చీ కొట్లాట కొనసాగుతోంది. ఈ క్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా మోగదాల పావని రమేష్ గౌడ్‌ను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ అనుచరులు ఆందోళన చేపట్టారు.

చౌటుప్పల్: మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు కుర్చీ కొట్లాట కొనసాగుతోంది. ఈ క్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా మోగదాల పావని రమేష్ గౌడ్‌ను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ అనుచరులు ఆందోళన చేపట్టారు. చైర్ పర్సన్ పదవి ఇస్తామని మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. సర్వీస్ రోడ్డుపై ధర్న చేశారు. మరోవైపు భారీ పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగింది.


ఈ వీడియోలు చూడండి:

ఇస్నాపూర్ చైర్మన్ ఎన్నిక కోసం ఒకే కారులో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే , బీజేపీ ఎంపీ

ఎంఐఎం కౌన్సిలర్ కిడ్నాప్.. బీఆర్ఎస్ నేతలే చేసారని ఆరోపణ

Updated at - Feb 16 , 2026 | 01:30 PM