Share News

MLA Rajagopal Reddy: మరోసారి సీఎం రేవంత్‌ను టార్గెట్ చేసిన.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

ABN , Publish Date - Aug 11 , 2025 | 05:09 PM

తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రాజగోపాల్ రెడ్డి 'ఎక్స్' వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

MLA Rajagopal Reddy: మరోసారి సీఎం రేవంత్‌ను టార్గెట్ చేసిన.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
Komatireddy Rajgopal Reddy

హైదరాబాద్: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా.. రేవంత్ రెడ్డిపై విరుచకపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌న్న హామీని అమ‌లు చేయ‌కుండా రాష్ట్ర ముఖ్య‌ నేత‌లు అడ్డుకున్నారని మండిపడ్డారు.


తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రాజగోపాల్ రెడ్డి 'ఎక్స్' వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి పదవిపై హైకమాండ్‌ మాట ఇచ్చిన విషయం సహా.. కొందరు అడ్డుకుంటున్నారనే వాస్తవాలను భట్టి బయటపెట్టారని చెప్పారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు. ప్రజలుకు ఇచ్చిన హామీల‌ను కాంగ్రెస్ స‌ర్కారు అమ‌లు చేయాల‌ని, అవినీతి ర‌హిత‌ పాల‌న అందించాల‌ని కోరుతున్నానని పేర్కొన్నారు. తెలంగాణ స‌మాజ ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేలా కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న ఉండాల‌ని ఆశిస్తున్నానట్లు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పార్టీ విలీనంపై కేసీఆర్ అత్యవసర సమావేశం..!

కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వం అసమర్థత బయటపడింది

Updated Date - Aug 11 , 2025 | 05:10 PM