ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

HCL and Foxconn: భారత్‌లో ఆరో సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

ABN, Publish Date - May 14 , 2025 | 09:35 PM

మోదీ ప్రభుత్వం దేశంలోని ఆరో సెమీకండక్టర్ ప్లాంట్‌ ఏర్పాటు గురించి కీలక ప్రకటన చేసింది. ఈ ప్లాంట్ రూ. 3706 కోట్ల వ్యయంతో HCL, ఫాక్స్‌కాన్ నేతృత్వంలో ఏర్పాటు కానుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

HCL and Foxconn

సెమీకండక్టర్లు డిస్ప్లే, చిప్స్ సహా అనేక ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు, భారత్ ఈ రంగంలో క్రమంగా పురగతి సాధిస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తర్ ప్రదేశ్ జెవార్ నగరంలో కేంద్రప్రభుత్వం ఆరో సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదించింది. ఈ ప్రాజెక్టు 3,706 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కాబోతుంది. జెవార్‌లో ప్రారంభమయ్యే ఈ ప్లాంట్ భారతదేశంలో తయారీ ప్రక్రియకు ఒక నూతన దిశను కల్పిస్తుందని చెప్పవచ్చు.


HCL, ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్

ఈ ప్లాంట్‌ను HCL, ఫాక్స్‌కాన్ కలిసి జాయింట్ వెంచర్‌గా స్థాపించనున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ఆటోమొబైల్‌లు, మరెన్నో పరికరాల కోసం అత్యాధునిక సెమీకండక్టర్ చిప్‌లను తయారు చేయనున్నారు. ప్రతిపాదిత ఈ ప్లాంట్ ప్రతి నెలలో 3.6 కోట్లు (36 మిలియన్) డిస్ప్లే డ్రైవర్ చిప్‌లను ఉత్పత్తి చేయనుంది. ఈ చిప్‌లు మన రోజు జీవనంలో ఉన్న చాలా ఎలక్ట్రానిక్ పరికరాలకు కీలకంగా మారనున్నాయి.


రెండు వేల మందికి జాబ్స్

ఈ ప్రాజెక్టు వల్ల 2,000 మందికి కొత్త ఉద్యోగాలు లభించబోతున్నాయి. ఈ కొత్త ఉద్యోగాలు ముఖ్యంగా సెమీకండక్టర్ తయారీ, పరిశోధన, అభివృద్ధి విభాగాలలో ఉంటాయి. ఈ ఉద్యోగాలు, కేవలం సాంకేతిక నైపుణ్యాలు కలిగి ఉన్న వారికి మాత్రమే కాక, యువతకు అవకాశాలను అందించనున్నాయి. ఇది జెవార్‌కు ఇచ్చే రెండో పెద్ద బహుమతి అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనికి ముందు జెవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రకటించారు. ఇది ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ విమానాశ్రయం ఈ సంవత్సరం చివర్లో పనిచేయడం ప్రారంభించే అవకాశం ఉంది.


భారతదేశంలో ఎలక్ట్రానిక్ పరిశ్రమకు పెద్ద దశ

ఈ కొత్త సెమీకండక్టర్ ఫ్యాక్టరీ భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు మంచి ఊపునిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ దాదాపు 25 లక్షల మందికి ఉపాధిని అందిస్తుంది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఇప్పటివరకు 5 సెమీకండక్టర్ యూనిట్లు ఆమోదించబడ్డాయి. వీటి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో, భారతదేశంలో ఒక యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఇది భారతదేశానికి తన సొంత సెమీకండక్టర్ ఉత్పత్తిని నిర్ధారించుకోవడానికి ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది.


ఇవి కూడా చదవండి

Monsoon Forecast: 16 ఏళ్ల తర్వాత దేశంలో మే 27 నాటికే వర్షాలు.. ఎక్కడెక్కడ ఎప్పుడంటే..


Bhargavastra: ఆకాశంలో శత్రు డ్రోన్‌లను నాశనం చేసే స్వదేశీ 'భార్గవస్త్ర' పరీక్ష సక్సెస్

Penny Stock: ఈ స్టాక్‎పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..


మరిన్ని
జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 14 , 2025 | 09:36 PM