Gold Rates Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు
ABN, Publish Date - May 19 , 2025 | 06:30 AM
దేశంలో బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. పెళ్లిళ్ల సీజన్ వేళ వీటి ధరలు (gold rates today may 19th 2025) తగ్గిపోవడం విశేషమనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం వీటి ధరలు ఏ స్థాయిలో ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. మే 19, 2025 నాటికి భారతదేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం (gold rates today may 19th 2025) పట్టాయి. గత కొన్ని రోజులుగా వీటి రేట్లు తగ్గుతుండటం విశేషం. రెండు వారాల క్రితం 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర 98 వేల స్థాయిలో ఉండగా, ప్రస్తుతం మాత్రం 95 వేలకు వచ్చేసింది.
ఈ నేపథ్యంలో గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం నేడు ఉదయం 6.30 గంటల నాటికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.95,120గా నమోదైంది. ఇక 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 87,190గా కలదు. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.95,270 కాగా, 22 క్యారెట్ పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 87,340గా ఉంది.
వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
ఇక వెండి ధరల విషయానికి వస్తే ఇవి కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో కేజీ వెండి ధర నిన్నటితో పోల్చితే రూ.100 తగ్గిపోయి రూ.106,900 స్థాయికి చేరుకుంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.96,900 కాగా, బెంగళూరు, పూణే, వడోదరా, ముంబై ప్రాంతాల్లో కూడా రూ.96,900 స్థాయిలోనే ఉంది.
గోల్డ్ స్వచ్ఛత గురించి తెలుసా..
24 క్యారెట్ల బంగారాన్ని అత్యంత స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. స్వచ్ఛమైన బంగారం లేదా 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది. బంగారు నాణేలు, కడ్డీలను తయారు చేయడానికి 24 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు. ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారం ఉపయోగిస్తారు. దీనిలో రెండు వంతుల వెండి, నికెల్ లేదా ఏదైనా ఇతర లోహం కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. ఇతర లోహాలను కలపడం వల్ల బంగారం గట్టిపడి, ఆభరణాలకు అనుకూలంగా ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం 91.67 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది.
ఈ కారణాలతో బంగారం ధరలు..
వివిధ కారణాల వల్ల బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్, మారకపు రేటు హెచ్చుతగ్గులు, ప్రస్తుత వడ్డీ రేట్లు సహా బంగారు వ్యాపారాన్ని నియంత్రించే ప్రభుత్వ నిబంధనలు కూడా ఉంటాయి. దీంతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇతర కరెన్సీలతో పోలిస్తే US డాలర్ బలం వంటి అంతర్జాతీయ సంఘటనలు కూడా భారత మార్కెట్లో బంగారం ధరలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి.
ఇవి కూడా చదవండి
UPI New Rule: యూపీఐ కొత్త రూల్.. తప్పు చెల్లింపుల కట్టడి కోసం కీలక సౌకర్యం..
Jyoti Malhotra Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి షాకింగ్ ఫాక్ట్స్
Upcoming IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
EPFO: ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 19 , 2025 | 06:54 AM