Gold Rate: గురువారం బంగారం ధర ఎంతంటే..
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:29 PM
బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డుల స్థాయికి చేరుకుంది. గురువారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,380 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.96,410కి చేరింది.
Gold Rate: బంగారం ధరలు (Gold Rate) ఆకాశాన్ని తాకుతున్నాయి. లక్ష రూపాయలకు (RS 1 Lakh) చేరువయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 98,380కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 96,410కి తాకింది. దేశంలోనే బంగారం ధర రికార్డుల స్థాయికి (Gold Hits Record) చేరుకుంది. బంగారం ధరలు భారీగా పెరగడానికి అమెరికా (America), చైనా (China) మధ్య కొనసాగుతున్నటువంటి వాణిజ్య యుద్ధం కారణం అని చెప్పవచ్చు.
Also Read..: Tirupati: రోడ్డుపై పడుకుని భూమన డ్రామా
బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డుల స్థాయికి చేరుకుంది. గురువారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,380 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.96,410కి చేరింది. ఒక కేజీ వెండి ధర రూ. 99,000 వద్ద కొనసాగుతోంది. ఓవైపు డాలర్ బలహీనత మరోవైపు అమెరికా చైనా మధ్య ట్యారిఫ్ యుద్ధం బంగారం రికార్డు స్థాయికి చేరడానికి దారి తీసాయి. ఈరోజు బంగారం ధరలు దాదాపు 4 శాతం పెరిగింది. అమెరికాలో డాలర్ బలహీన పడటంతో పాటు చైనా మీద అమెరికా టారిఫ్‌లు పెంచడంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక స్థాయికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల అమెరికా ఆర్థికం వైపు వెళుతుందా అని చాలామంది భావిస్తున్నారు. జూన్ నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ కూడా అంచనా వేస్తోంది. సెంట్రల్ బ్యాంకులు సైతం బంగారం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి, ఇది కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణం అవుతోంది.
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 98,380గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 96,410కు చేరింది. కిలో వెండి ధర రూ.99,000 వద్ద కొనసాగుతోంది.
విజయవాడ.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 98,380గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 96,410కు చేరింది. కిలో వెండి ధర రూ.99,000 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 98,380గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 96,410కు చేరింది. కిలో వెండి ధర రూ.99,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు గురువారం ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
ఈ వార్తలు కూడా చదవండి..
సురానా ఇంట్లో భారీగా నగదు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
ఆ టాబ్లెట్స్ మోతాదుకు మించి తీసుకుంటే..
For More AP News and Telugu News
Updated Date - Apr 17 , 2025 | 12:32 PM