ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: బంగారం ధర భారీగా తగ్గిందోచ్, కానీ వెండి మాత్రం

ABN, Publish Date - Jun 28 , 2025 | 06:40 AM

పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా ఈ రోజు ఉదయం నాటికి 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.930 పడిపోయింది. దీంతోపాటు వెండి రేటు కూడా తగ్గింది. అయితే ప్రస్తుతం (Gold and Silver Rates Today June 28th 2025) వీటి ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Gold and Silver Rates Today

బంగారం, వెండి ప్రియులకు ఈ రోజు (Gold Rates Today) అద్భుతమైన శుభవార్త వచ్చింది. ఎందుకంటే బంగారం ధరలు దాదాపు ఏకంగా వెయ్యి రూపాయలు తగ్గుముఖం పట్టాయి. ఇది బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశమని చెప్పుకోవచ్చు. దీంతోపాటు వెండి ధరలు కూడా తగ్గాయి. ఈ మార్పులు మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం వల్ల జరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ ధరలు ప్రస్తుతం (Gold and Silver Rates Today June 28th 2025) ఏ మేరకు చేరుకున్నాయో ఇక్కడ తెలుసుకుందాం. జూన్ 28, 2025న గుడ్ రిటర్న్స్ వెబ్‎సైట్ ప్రకారం ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్, విజయవాడ‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.930 తగ్గి రూ. 98,010కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 89,840కు చేరింది.

ఈరోజు వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇక నేటి వెండి ధరల విషయానికి వస్తే కిలో వెండి ధర కేవలం రూ.100 మాత్రమే తగ్గింది. జూన్ 27 నాటి ధరలతో పోలిస్తే ఈరోజు స్వల్పంగా తగ్గింది. ఈ క్రమంలో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.1,07,800కి చేరింది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నైలో రూ. 1,17,800 స్థాయిలో ఉండగా.. ముంబయి, పూణే, వడోదర, బెంగళూరు, పాట్నా, సూరత్, మైసూర్, నాగ్ పూర్‎లో కిలో వెండి రేటు రూ.1,07,800గా ఉంది.

ఈ భారీ తగ్గుదలకి ప్రధాన కారణాలు

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగజారడంతో దేశీయ మార్కెట్‌పై ప్రభావం పడింది. దీంతోపాటు అమెరికా డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ పెరగడంతో బంగారానికి డిమాండ్ తగ్గింది. ఇది క్రమంగా పసిడి రేటు తగ్గుదలకు దారితీసింది. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ పాలసీ, అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులు కూడా వీటి ధరలపై ప్రభావం చూపాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేయడం లేదా పెట్టుబడులు చేసే సమయంలో మళ్లీ రేట్లు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఇవీ చదవండి:

సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు


జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 28 , 2025 | 08:36 AM