Real Estate Deal: రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరో సంచలనం.. వారంలోనే రూ.11,000 కోట్ల డీల్ పూర్తి..
ABN, Publish Date - Jul 14 , 2025 | 04:40 PM
భారత రియల్ ఎస్టేట్ రంగంలో మరోసారి సంచలన సేల్ నమోదైంది. రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ (DLF) తన లగ్జరీ ప్రాజెక్ట్ ప్రివానా నార్త్‌ను ప్రారంభించిన వారం రోజుల్లోనే ఈ ప్రాజెక్టులోని రూ.11,000 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌లు అమ్ముడయ్యాయి.
దేశంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరోసారి అరుదైన రికార్డ్ నమోదైంది. DLF లగ్జరీ ప్రాజెక్ట్ ప్రివానా నార్త్ (Privana North) ప్రారంభమైన వారం రోజుల్లోనే రూ.11,000 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌లు పూర్తిగా అమ్ముడుపోయాయి. దీంతో గురుగ్రామ్‌లో లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు ఉన్న డిమాండ్‌ను ఇది స్పష్టంగా తెలియజేస్తోందని నిపుణులు చెబుతున్నారు. సెక్టార్ 76, 77లలో 116 ఎకరాల విస్తీర్ణంలో భాగంగా, 17.7 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్ట్, ఆరు అత్యాధునిక టవర్లతో 50 అంతస్తుల ఎత్తులో నిర్మితమైంది. ఇవి DLF నిర్మించిన అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ టవర్లుగా రికార్డు సృష్టించాయి.
లగ్జరీ నివాసాలు
DLF ప్రివానా నార్త్‌లో 1,152 విశాలమైన 4 BHK అపార్ట్‌మెంట్‌లు, 12 గ్రాండ్ పెంట్‌హౌస్‌లు ఉన్నాయి. ప్రతి అపార్ట్‌మెంట్‌కు మూడు ప్రత్యేక కారు పార్కింగ్ స్థలాలు, పెంట్‌హౌస్‌లకు నాలుగు పార్కింగ్ స్థలాలు కేటాయించబడ్డాయి. ఈ ప్రాజెక్ట్ ఆధునిక జీవనశైలికి అనుగుణంగా రూపొందించబడింది. ఇందులో అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ డిజైన్ వంటివి ఉన్నాయి. గురుగ్రామ్‌లోని సెక్టార్ 76, 77లలో 116 ఎకరాల సమగ్ర టౌన్‌షిప్‌లో భాగంగా లగ్జరీ జీవనానికి ఈ సేల్ కొత్త నిర్వచనం అందిస్తోంది.
గతంలో కూడా..
DLF గత ఏడాది కూడా రెండు లగ్జరీ ప్రాజెక్టులు ప్రివానా వెస్ట్, ప్రివానా సౌత్‌ను ప్రారంభించి రూ.12,800 కోట్ల విలువైన యూనిట్లను పూర్తిగా సేల్ చేసింది. 2024 మేలో, 12.57 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ప్రివానా వెస్టులో 795 అపార్ట్‌మెంట్‌లు కేవలం మూడు రోజుల్లో రూ.5,590 కోట్లకు అమ్ముడయ్యాయి. అంతకుముందు 2024 జనవరిలో 25 ఎకరాల విస్తీర్ణంలోని ప్రివానా సౌత్లో 1,113 లగ్జరీ అపార్ట్‌మెంట్‌లు కూడా మూడు రోజుల్లో రూ.7,200 కోట్లకు అమ్ముడుపోయాయి.
లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు డిమాండ్
గురుగ్రామ్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్‌లలో ఒకటిగా ఉంది. ఈ ప్రాంతంలో లగ్జరీ నివాసాలకు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. ఆధునిక సౌకర్యాలు, అద్భుతమైన కనెక్టివిటీ, అభివృద్ధి చెందుతున్న వ్యాపార కేంద్రాలు గురుగ్రామ్‌ను లగ్జరీ జీవనం కోరుకునేవారికి మంచి గమ్యస్థానంగా మార్చాయి. DLF ప్రివానా నార్త్ వంటి ప్రాజెక్టులు ఈ డిమాండ్‌ను తీర్చడమే కాక, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌లకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 14 , 2025 | 06:37 PM