కోల్ ఇండియా లాభంలో క్షీణత
ABN, Publish Date - May 08 , 2025 | 04:35 AM
ప్రభుత్వ రంగంలోని కోల్ ఇండి యా లిమిటెడ్ (సీఐఎల్) 2024-25 ఆర్థిక సంవత్సరం ఫలితాలు మార్కెట్‌ను నిరాశ పరిచా యి. ఈ కాలానికి కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.37,402.29 కోట్ల నుంచి రూ.35,358.16 కోట్లకు...
ఒక్కో షేరుపై రూ.5.15 డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని కోల్ ఇండి యా లిమిటెడ్ (సీఐఎల్) 2024-25 ఆర్థిక సంవత్సరం ఫలితాలు మార్కెట్‌ను నిరాశ పరిచా యి. ఈ కాలానికి కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.37,402.29 కోట్ల నుంచి రూ.35,358.16 కోట్లకు పడిపోయింది. ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగి రూ.1,52,731.5 కోట్ల నుంచి రూ.1,52,888.98 కోట్లకు చేరింది. అయితే మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో మాత్రం సీఐఎల్ నికర లాభం, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12 శాతం పెరిగి రూ.9,604 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆదాయమూ రూ.40,457.59 కోట్ల నుంచి రూ.41,761.76 కోట్లకు చేరింది.
నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుండడంతో రూ.10 ముఖ విలువ ఉన్న ఒక్కో షేరుపై రూ.5.15 చొప్పున తుది డివిడెండ్ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. సీఐఎల్ ఇప్పటికే ఒక్కో షేరుపై రూ.21.35 చొప్నున మధ్యంతర డివిడెండ్ చెల్లించింది. ఈ తుది డివిడెండ్‌ను కలిపితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి వాటాదారులకు ఒక్కో షేరు పై రూ.26.5 చొప్పున డివిడెండ్ చెల్లించినట్టవుతుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రూపాయి ఎక్కువ. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.10 ముఖ విలువ ఉన్న షేర్లపై కంపెనీ 265 శాతం డివిడెండ్ చెల్లించినట్టవుతుంది
ఏంజెల్ వన్ ఏఎంసీ నుంచి కొత్త ఫండ్లు..
ఏంజెల్ వన్ లిమిటెడ్ సబ్సిడియరీ ఏంజెల్ వన్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ రెండు కొత్త ఫండ్లను ప్రవేశపెట్టింది. ఏంజెల్ వన్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, ఏంజెల్ వన్ నిఫ్టీ 50 ఈటీఎఫ్ ఇందులో ఉన్నాయి. ఈ న్యూ ఫండ్ ఆఫర్‌లు (ఎన్ఎఫ్ఓ) మే 16, 2025 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరిచి ఉంటాయి. ఈ ఫండ్లు నిఫ్టీ 50 ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తాయి.
Read Also: Stock Markets Wednesday Closing: యుద్ధం జరుగుతున్నా ఏమాత్రం జంకని భారత స్టాక్ మార్కెట్లు
Updated Date - May 10 , 2025 | 04:32 AM