Share News

Stock Markets Wednesday Closing: యుద్ధం జరుగుతున్నా ఏమాత్రం జంకని భారత స్టాక్ మార్కెట్లు

ABN , Publish Date - May 07 , 2025 | 04:10 PM

యుద్ధం మొదలైనా ఏమాత్రం జంకలేదు భారత స్టాక్ మార్కెట్లు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారీగా మార్కెట్లు పడతాయని భావించిన వారి అంచనాలను తలకిందులు చేసింది.

 Stock Markets Wednesday Closing: యుద్ధం జరుగుతున్నా ఏమాత్రం జంకని భారత స్టాక్ మార్కెట్లు
Stock Markets Wednesday Closing

Stock Markets Wednesday Closing: భారత స్టాక్ మార్కెట్ల దమ్మెంతో ప్రపంచానికి తెలిసొస్తోంది. ఆఖరికి పాకిస్థాన్ తో యుద్ధం మొదలుపెట్టినప్పటికీ కూడా ఇండియా మార్కెట్లు ఏ మాత్రం జంకలేకుండా తమ దమ్మెంతో చూపించాయి. అటు, ట్రంప్ టారిఫ్స్ పెడితే, యావత్ ప్రపంచం ఒణికిపోతే, ఇండియా మాత్రం ఏ మాత్రం తొణకలేదు. ఇదే ఊపుని చివరికి యుద్ధం సమయంలోనూ చూపించాయి. ఇవాళ (బుధవారం) సెన్సెక్స్ 105.71 పాయింట్లు లాభపడి, 80,746.78 దగ్గర ఉంటే, నిఫ్టీ 34.80 పాయింట్లు పెరిగి 24,414.40 దగ్గర క్లోజ్ అయింది.

నిఫ్టీలో టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా ప్రధాన లాభాలను ఆర్జించగా, ఆసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఐటిసి నష్టపోయాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం పెరిగింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది. ఎఫ్‌ఎంసిజి, ఫార్మా మినహా అన్ని రంగాలలో మిగతా సూచీలు గ్రీన్‌లో ముగిశాయి.


ఇవి కూడా చదవండి

Operation Sindhur: ఆపరేషన్ సింధూర్‌ను పర్యవేక్షించిన.. ప్రధాని మోదీ..

India Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌.. ఈ పేరు పెట్టడానికి అసలు కారణం ఇదే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 07 , 2025 | 04:17 PM