India Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఈ పేరు పెట్టడానికి అసలు కారణం ఇదే..
ABN , First Publish Date - 2025-05-07T08:57:08+05:30 IST
'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన చర్య ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పహల్గామ్ దాడిలో అమరులైన వారికి న్యాయం చేసేందుకు పాక్, పీఓకేలో 9 ఉగ్ర స్థావరాలపై భారత త్రివిధ దళాలు దాడి చేశాయి. అయితే, ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించేందుకు భారత్ "ఆపరేషన్ సిందూర్" అనే పేరు ఎందుకు పెట్టింది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారు జామున పాకిస్తాన్‌పై భారత్ సైన్యం విరుచుకుపడింది. "ఆపరేషన్ సిందూర్" పేరుతో పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన చర్య ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పహల్గామ్ దాడిలో అమరులైన వారికి న్యాయం చేసేందుకు పాక్, పీఓకేలో 9 ఉగ్ర స్థావరాలపై భారత త్రివిధ దళాలు దాడి చేశాయి. అయితే, ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించేందుకు భారత్"ఆపరేషన్ సింధూర్" అనే పేరు ఎందుకు పెట్టింది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
‘ఆపరేషన్ సిందూర్’.. ఈ పేరు పెట్టడానికి అసలు కారణం పహల్గామ్ ఉగ్రదాడి. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో మొత్తం 28 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు అతి దారుణంగా మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఈ ఉగ్రవాద దాడిలో 26 ఏళ్ల ఓ నేవీ అధికారి వినయ్ మరణించాడు. అతడిని పెళ్లి జరిగిన కేవలం ఐదు రోజులకే టెర్రరిస్టులు అతి కిరాతకంగా హత్య చేశారు. భర్త వినయ్ మృతదేహం వద్ద గుండెలవిసేలా భార్య హిమాన్షి ఏడుస్తున్న ఫొటో దేశం మొత్తాన్ని కదిపేసింది. ఈ ఉగ్రదాడిలో హిమాన్షితో పాటు చాలా మంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. ఇందుకు ప్రతీకారంగానే భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. పాక్‌పై భారత్ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టినందుకు పహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
Also Read:
Operation Sindhur: 'ఆపరేషన్ సిందూర్'కు అభినందనల వెల్లువ
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. బహవల్పూర్‌ను భారత్ ఎందుకు టార్టెట్ చేసింది..