Share News

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. బహవల్పూర్‌ను భారత్ ఎందుకు టార్టెట్ చేసింది..

ABN , Publish Date - May 07 , 2025 | 08:01 AM

ఆపరేషన్ సింధూర్..బహవల్పూర్‌ను భారత్ ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? మసూద్ అజార్, జైష్‌కు సంబంధం ఏంటి? పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. బహవల్పూర్‌ను భారత్ ఎందుకు టార్టెట్ చేసింది..
Pakistan Bahawalpur

Operation Sindoor: భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. నేడు తెల్లవారుజామున 1.28 గంటలకు భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' కింద పాకిస్తాన్‌పై దాడులు జరిపింది. వాటిలో బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ స్థావరం, మురిడ్కేలోని లష్కరే-ఎ-తోయిబా స్థావరం బలమైనవి. అయితే, బహవల్పూర్‌ను భారత్ ఎందుకు టార్టెట్ చేసింది? బహవల్‌పూర్‌ను మసూద్ అజార్ బలమైన స్థావరంగా ఎందుకు పరిగణిస్తారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


బహవల్పూర్‌ను భారత్ ఎందుకు టార్టెట్ చేసింది?

భారతదేశ మోస్ట్ వాంటెడ్ పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్‌కు బలమైన స్థావరంగా బహవల్పూర్ పరిగణించబడింది. జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తున్న అజార్, 2001లో పార్లమెంటుపై దాడి నుండి 2019లో పుల్వామా బాంబు దాడి వరకు అనేక కేసుల్లో అజార్‌పై మన అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. నివేదికల ప్రకారం, మసూద్‌కు పాకిస్తాన్ లోని బహవల్పూర్‌లో రెండు ఇళ్ళు ఉన్నాయి. ఒకటి ఉస్మాన్-ఓ-అలీ మసీదు పక్కనే ఉంది. మసూద్ రెండవ ఇల్లు కూడా మొదటి ఇంటి నుండి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జామియా మసీదు అని పిలువబడే మసీదు పక్కనే ఉంది. అంతేకాకుండా, బహవల్‌పూర్‌లో ఉగ్రవాద సంస్థకు నాలుగు శిక్షణా కేంద్రాలు ఉన్నాయని సమాచారం. బహవల్పూర్‌లో పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం, ఒక వైమానిక స్థావరం కూడా ఉంది. దీనికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ శిక్షణా శిబిరం ఉంది.

మసూద్ అజార్ ఎవరు?

1999 కాందహార్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ తర్వాత భారత అధికారులు విడుదల చేసిన ముగ్గురు ఉగ్రవాదులలో మసూద్ అజార్ కూడా ఉన్నాడు. అతను పాకిస్తాన్ వెళ్లి జైష్-ఎ-మొహమ్మద్ పేరుతో ఉగ్రవాద సంస్థను ప్రారంభించాడు. పార్లమెంటుపై దాడి కేసు, పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి, 2019లో దక్షిణ కాశ్మీర్‌లో 40 మంది CRPF సిబ్బందిపై ఉగ్రవాద సంస్థ దాడి చేసిన కేసులో కూడా మసూద్ అజార్ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు.


Also Read:

India Revenge On Pahalgam: పహల్గామ్‌కు భారత్ ప్రతీకారం.. ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక ఉన్న ఏజెన్సీ ఏంటి..

భారత్ ఆపరేషన్‌ సింధూర్..

Updated Date - May 07 , 2025 | 09:15 AM