Share News

Operation Sindhur: ఆపరేషన్ సింధూర్‌ను పర్యవేక్షించిన.. ప్రధాని మోదీ..

ABN , Publish Date - May 07 , 2025 | 09:20 AM

ఆపరేషన్‌ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోకి ఉగ్రరూకపై విరుచుకుపడుతోంది. పాకిస్థాన్‌లోని 9 ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసింది.

Operation Sindhur: ఆపరేషన్ సింధూర్‌ను పర్యవేక్షించిన.. ప్రధాని మోదీ..

ఆపరేషన్‌ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోకి ఉగ్రరూకపై విరుచుకుపడుతోంది. పాకిస్థాన్‌లోని 9 ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసింది. ఈ దాడిలో ఇప్పటివరకూ సుమారు 80 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ కూడా అనంతరం సరిహద్దుల వెంబడి కాల్పులకు దిగింది. అయితే భారత ఆర్మీ వారికి దీటుగా సమాధానం ఇస్తున్నారు.


పాకిస్థాన్‌‌లోని ఉగ్రవాద శిబిరాలపై బుధవారం వేకువజామున భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పర్యవేక్షించారు. రాత్రంతా వార్ రూమ్‌లో ఉండి భారత ఆర్మీకి సపోర్ట్‌గా ఉన్నారు. మరోవైపు ఈ దాడి వివరాలను భారత ఉన్నతాధికారులు.. అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి సమాచారం అందించారు. అలాగే ఆపరేషన్ సింధూర్‌పై వాషింగ్టన్‌ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్‌ పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. అదేవిధంగా భారత భద్రతా సలహాదారు అజిత్ ధోవల్.. అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్లాడారు.

Updated Date - May 07 , 2025 | 09:20 AM