Union Budget For TDS-TCS: టీడీఎస్‌పై కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. భారీగా రెట్టింపు
ABN, Publish Date - Feb 01 , 2025 | 12:47 PM
TDS-TCS: బడ్జెట్-2025లో మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చింది. ఆదాయం పన్ను నుంచి టీడీఎస్-టీసీఎస్ వరకు చాలా అంశాల్లో ఊహించని శుభవార్తలు చెప్పింది.
బడ్జెట్-2025లో కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు అనేక విషయాల్లో తీపికబురు అందించింది. ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను వసూలుకు అనుసరిస్తున్న టీడీఎస్ విధానంపై కేంద్ర సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. టీడీఎస్‌తో పాటు టీసీఎస్‌ను తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వృద్ధులకు ఇచ్చే పన్ను తగ్గింపుపై వడ్డీని రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంచుతున్నట్లు వెల్లడించారు. వార్షిక టీడీఎస్ లిమిట్‌ను రూ.2.40 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
మెడికల్ విద్యార్థులకు శుభవార్త.. పదేళ్లల్లో ఎన్ని మెడికల్ సీట్లు పెంచనున్నారంటే..
డెలివరీ సంస్థలో పనిచేస్తున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
ప్రపంచంలోనే తొలిసారి ఒకే స్తంభంపై ఐదు మెట్రోరైలు పట్టాలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 01 , 2025 | 12:50 PM