ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: ఈ జనరేషన్‎కు ఆ సామర్థ్యాలు లేవు..ఓ సంస్థ సీఈఓ కామెంట్స్ వైరల్

ABN, Publish Date - Mar 18 , 2025 | 03:36 PM

మీకు జనరేషన్ Z గురించి తెలుసా. రీల్స్ చేస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్‎గా ఉండే యువతను జనరేషన్ జడ్ అంటారు. వీరి గురించి ఓ సంస్థ సీఈఓ కీలక వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Generation Z

ప్రస్తుతం జనరేషన్ Z గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తాజాగా వీరి గురించి బెంగళూరుకు చెందిన ప్రముఖ సంస్థ CEO ఆశిష్ గుప్తా కీలక విషయాలను వెల్లడించారు. ఆశిష్ లింక్డ్ఇన్‌లో చేసిన ఒక పోస్ట్‌లో జనరేషన్ Z గురించి కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ఈ జనరేషన్ రీల్స్ చేయడం, డిజిటల్ ట్రెండ్స్, వైరల్ కంటెంట్ సృష్టించడంలో చాలా నైపుణ్యం కలిగివుంటారు. కానీ, వీరికి ప్రాథమిక గణితం, ఆర్థిక అక్షరాస్యత, మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.


సీఈఓ అనుభవం

ఆ పోస్ట్‌లో ఆశిష్ గుప్తా తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. ఇటీవల ఒక ప్రముఖ సంస్థలో క్యాంపస్ నియామక ప్రక్రియలో, BBA, BCA వంటి డిగ్రీలతో ఉన్న కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంపై ఆయన చర్చించారు. ఈ సందర్భంలో 50 మందికి పైగా విద్యార్థులను ఒక గణిత ప్రశ్నను అడిగినట్లు చెప్పారు. ఒక కారు మొదట 60 కి.మీ. 30 కి.మీ వేగంతో, తర్వాతి 60 కి.మీ, 60 కి.మీ వేగంతో ప్రయాణిస్తే, దాని సగటు వేగం ఎంత? అని అడిగినట్లు తెలిపారు. ఈ ప్రశ్నకు కేవలం ఇద్దరు విద్యార్థులే సరైన సమాధానం ఇచ్చారని వెల్లడించారు. కానీ మిగిలినవారు మాత్రం దీనిని సరైన విధంగా పరిష్కరించడానికి చాలా ఇబ్బంది పడినట్లు చెప్పారు.


డిజిటల్ ట్రెండ్స్ గురించి..

దీనిని బట్టి చూస్తే సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుతం జనరేషన్ పై ఏ మేరకు ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ జనరేషన్ ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వైరల్ కంటెంట్, డిజిటల్ ట్రెండ్‌ల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని ప్రస్తావించారు. కానీ ప్రాథమిక గణిత సమస్యలను పరిష్కరించడం లేదా ఆర్థికంగా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు మాత్రం వీరికి లేవని అనిపించినట్లు వెల్లడించారు.


విమర్శలు వచ్చినప్పుడు..

అంతే కాదు జనరేషన్ Z ఉద్యోగులకు కొన్ని ఇతర సవాళ్లు కూడా ఉంటాయని గుప్తా తెలిపారు. ఉదాహరణకు 65 శాతం యజమానులు వారిలో హక్కుల దృక్పథాన్ని కల్కి ఉంటారని అన్నారు. ఆ క్రమంలో ఈ జనరేషన్ వ్యక్తిగత విమర్శలు ఎదుర్కొన్నప్పుడు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. అలాంటి సమయాల్లో వారు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడం, వాటిని సరిగా స్వీకరించడం కూడా కష్టంగా మారుతుందని గుప్తా భావించారు.


ఇవి కూడా చదవండి:

Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 18 , 2025 | 03:37 PM