Amazon Prime Video: ప్రైమ్ వీడియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి యాడ్స్.. వద్దంటే ఇంత కట్టాల్సిందే..
ABN, Publish Date - May 16 , 2025 | 05:19 PM
Amazon Prime Video ads: ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) యూజర్లకు బ్యాడ్ న్యూస్. వచ్చే నెల నుంచి ప్రైమ్ వీడియోలో యాడ్స్ కనిపిస్తాయని కంపెనీ ప్రకటించింది. యాడ్ ఫ్రీ యాక్సెస్ కావాలంటే ఇకపై వినియోగదారులు అదనంగా ఖర్చు చేయక తప్పదు.
Prime Video Ad-Free Subscription: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) యూజర్లకు షాకింగ్ న్యూస్. భవిష్యత్తులో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు మరింత ప్రియం కానున్నాయి. అంతేగాక, ఇప్పటి వరకూ యూజర్లు పొందుతున్న యాడ్ ఫ్రీ సదుపాయం ఇకపై ఉండదు. వచ్చే నెల నుంచి భారతదేశంలో ప్రైమ్ వీడియోలో యాడ్స్ ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. జూన్ 17 వ తేదీ నుంచి ప్రైమ్ వీడియోలో వెబ్ సిరీస్‌లు, సినిమాలు, షోలను యాడ్స్ లేకుండా యూజర్లు ఆస్వాదించలేరు. ఒకవేళ యాడ్స్ వద్దనుకుంటే మాత్రం ఎక్స్ ట్రా పే చేయాల్సిందే.
జూన్ 17 నుంచి ప్రైమ్ వీడియోలో అర్థవంతమైన ప్రకటనలే దర్శనమిస్తాయని కంపెనీ వెల్లడించింది. యాడ్ ఫ్రీ సదుపాయం పొందాలంటే యూజర్లు ఎక్స్ ట్రా చెల్లించాల్సిందేంటూ ఈ మెయిల్స్ కూడా పంపుతోంది. ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు నెలకు రూ.129 లేదా ఏడాదికి రూ.699 యాడ్-ఆన్ ప్లాన్స్ తీసుకుంటే ఇష్టమైన సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లను యాడ్స్ లేకుండానే ఆస్వాదించవచ్చు. అలాగే వీరు ఎప్పట్లానే ప్రైమ్ ఫాస్ట్ డెలివరీ, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్స్
ఇండియాలో ప్రైమ్ మూడు రకాల ప్లాన్స్ అందిస్తోంది. ప్రైమ్ షాపింగ్ ఎడిషన్, ప్రైమ్ లైట్, స్టాండర్డ్ ప్రైమ్ సర్వీస్.
ప్రైమ్ షాపింగ్ ఎడిషన్: ఈ ప్లాన్ మొత్తం సంవత్సరానికి రూ. 399 ఖర్చవుతుంది. కానీ ఇందులో ప్రైమ్ వీడియో వంటి సేవలు ఉండవు.
ప్రైమ్ లైట్: సంవత్సరానికి రూ.799. ఈ ప్లాన్ వినియోగదారులకు ప్రైమ్ సర్వీస్ అన్ని ప్రయోజనాలను అందుతాయి. 720p క్వాలిటీతో వీడియో స్ట్రీమింగ్ ఉంటుంది.
స్టాండర్డ్ ప్రైమ్: ఈ ప్లాన్ కోసం ఏడాది రూ. 1499 ఖర్చవుతుంది. ఇతర ప్రయోజనాలతో పాటు HD వీడియో యాక్సెస్‌ను పొందవచ్చు.
రాబోయే మార్పులు
సంవత్సరానికి రూ.699, నెలకు రూ.129 యాడ్-ఫ్రీ యాడ్-ఆన్ సర్వీస్ ప్రవేశపెట్టడం వల్ల స్టాండర్డ్ ప్రైమ్ సర్వీస్ ధర రూ.2198 కు పెరుగుతుంది. ప్రైమ్ లైట్ యూజర్లు సంవత్సరానికి మొత్తం రూ.1498 ఖర్చు చేయాలి. నెలవారీ ప్లాన్‌లను పరిశీలిస్తే వినియోగదారులు ప్రస్తుతం స్టాండర్డ్ ప్లాన్ కోసం రూ.299 చెల్లిస్తున్నారు. యాడ్-ఆన్‌తో ఇది నెలకు రూ.428కి పెరుగుతుంది.
ఈ మార్పులతో పాటు అమెజాన్ ఇటీవల ప్రైమ్ వీడియో ఒకేసారి యాక్సెస్ చేసే డివైజెస్ సంఖ్యను కూడా తగ్గించింది. గతంలో యూజర్లు 10 పరికరాల్లో లాగిన్ అయ్యేవారు. ఇకపై ఒకే సమయంలో రెండు పరికరాలను మాత్రమే యాక్సెస్ చేయగలరు.
Read Also: Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుని ఆర్నేళ్లు కట్టకపోతే జైలుకు పంపిస్తారా..రూల్స్ ఏం చెబుతున్నాయ్
Updated Date - May 16 , 2025 | 05:50 PM